Jr. NTR : చిరంజీవి, నాగార్జున బాటలో జూ. ఎన్టీఆర్.. నా హక్కులు కాపాడండంటూ హైకోర్టుకు..

Jr NTR: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన విషయంలో కోర్టుకెక్కుతున్న విషయం తెలిసిందే. నటుల అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ఉపయోగించి, వారిని ఇబ్బందిపెట్టేలా ట్రోలింగ్, డీప్ ఫేక్ వీడియోల తయారీ, వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యకి చెక్ పెట్టాడానికి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇదే తరహాలో హైకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఎంత ప్రయోజనాలున్నాయో.. అంతే నష్టాలున్నాయి. దీనికి సోషల్ మీడియా తోడు కావడంతో సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రత్యేకించి డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ జనరేషన్‌ వల్ల ప్రముఖుల గొంతు (వాయిస్), రూపాలు సులభంగా డూప్లికేట్ చేయబడుతున్నాయి.దీన్ని కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు, కొన్ని ఈ-కామర్స్ సంస్థలు తమ ప్రమోషన్స్ కోసం సెలబ్రెటీల ఫోటోలు,వీడియోలు ఉపయోగిస్తున్నాయి.

Jr NTR Moves Delhi High Court to Protect Personality Rights Interim Orders Issued

తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఈ-కామర్స్ సంస్థలు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని, వాటిని అడ్డుకోవాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు, ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం .. సోషల్ మీడియా, ఈ-కామర్స్ సంస్థలు, టెలికాం ఆపరేటర్లు ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ అరోరా స్పష్టం చేశారు. ఈ కేసును డిసెంబర్ 22కి వాయిదా వేయడంతో ఆ రోజున మరిన్ని వివరమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున కూడా ఇదే తరహాలో వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇటీవలి బాలీవుడ్ లో కూడా జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆశా భోంస్లే, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ , నిర్మాత కరణ్ జోహార్ వంటి సినీ సెలబ్రెటీలు వ్యక్తిత్వ (Personality) హక్కులు కోసం కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో సెలబ్రిటీల వ్యక్తిగత బ్రాండ్, ఇమేజ్‌ను రక్షించుకోవడానికి లీగల్ మార్గం మరింత బలపడినట్లు భావిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ,డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: jr ntr prashanth neel chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X