ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ లీక్.. తమన్ ట్వీట్ వెనుక భారీ సీక్రెట్ ఇదేనా?
Ntr New Look: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో. నటన, డాన్స్, మాస్ ఇమేజ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న తారక్.. N.T.రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా, తన టాలెంట్‌తోనే స్టార్‌డమ్ అందుకున్నాడు. RRR తో పాన్ ఇండియా హీరోగా మారిన ఆయన, దేవర తో మరో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే.. తాజా ఎన్టీఆర్ సంబంధించిన ఓ సరికొత్త లుక్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటరేంటీ?
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల్లో అత్యంత హైప్ ఉన్న ప్రాజెక్ట్ 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. డ్రాగన్ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో కొత్త ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతోంది. ముఖ్యంగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుందని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ సంబంధించిన ఓ సరికొత్త లుక్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే.. ఈ ఫోటోను షేర్ చేసింది ఎవరో కాదు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎన్టీఆర్ స్పెషల్ ఫోటోను షేర్ చేశారు. ఫోటోను పోస్ట్ చేస్తూ తమన్ కొన్ని 'బాంబ్' ఎమోజీలు ఉపయోగించడంతో ఇది కేవలం స్టైలిష్ ఫోటో కాదు.. పెద్ద అప్డేట్‌కు హింట్ అనే చర్చ మొదలైంది. ఈ ఫోటో బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. ఆ ఫోటోలో ఎన్టీఆర్ గుబురు గడ్డం, స్టైలిష్ లాంగ్ హెయిర్, నోట్లో టూత్‌పిక్‌తో పూర్తి రగ్గడ్ మాస్ అవతార్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా "ఇది ఏ సినిమాకి సంబంధించిన లుక్?" అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫోటోలో ఆయన చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో కూడా ప్రతి సినిమాకు తన లుక్‌ను పూర్తిగా మార్చుకునే ఎన్టీఆర్.. ఇప్పుడు మరోసారి కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొందరు ఇది దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' సినిమా లుక్ అని భావిస్తుంటే.. మరికొందరు మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' కోసం తారక్ ఈ మేకోవర్ చేశారని భావిస్తున్నారు. ఇంకొందరు అయితే ఈ ఫోటో AI ద్వారా రూపొందించిందేనేమో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ విషయంలో తమన్ క్లారిటీ ఇస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications


