Jr NTR సరికొత్త రూట్.. నందమూరి ఫ్యామిలీలో పోటీగా తారక్ న్యూ ప్లాన్!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా దీనిని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఐలాండ్ నేపథ్యంలో ఈ సినిమా కథని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. అలాగే సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కూడా సొంతగా ప్రొడక్షన్ హౌస్ లు స్టార్ట్ చేశారు. ఇదిలా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ స్టార్ట్ చేశారు. ఈ ప్రొడక్షన్ నుంచి మినిమమ్ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు.

 Jr NTR

అలాగే నాని కూడా వాల్ పోస్టర్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేశారు. ఇక రామ్ చరణ్ కొనెదల ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మెగాస్టార్ తో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు వి మెగా పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ది ఇండియా హౌస్ చిత్రాన్ని నిఖిల్ హీరోగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఅర్ కూడా కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతున్నారంట.

కళ్యాణ్ రామ్ తో కలిసి తారక్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలో లో బడ్జెట్ మూవీస్ తో పాటు మినిమం రేంజ్ మూవీస్ వరకు నిర్మించాలని ప్లానింగ్ లో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. మరి ఎన్టీఆర్ స్టార్ట్ చేయబోయే నిర్మాణ సంస్థ నుంచి మొదటిగా ఏ సినిమా వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ నిర్మించే సినిమా బాద్యతలని నమ్రత శిర్కొడ్కర్ చూసుకుంటూ ఉంటుంది. మరి ఎన్టీఆర్ కూడా తన నిర్మాణ సంస్థ బాద్యతలు ప్రణతికి అప్పగిస్తాడేమో వేచి చూడాలి. ఏది ఏమైనా టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ నిర్మాణ సంస్థలు స్టార్ట్ చేయడమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని కొత్త దర్శకులని ఎంకరేజ్ చేస్తూ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X