NTR Huge Meeting : ఎన్టీఆర్ పకడ్బందీ ప్లాన్.. త్వరలోనే వారితో సమావేశం

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. చివరిగా ఎన్టీఆర్ దేవర చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంచనాలను మించకపోవడంతో తన రాబోయే చిత్రాలపై తారక్ ఫుల్ ఫోకస్ పెట్టారు. రీసెంట్ గానే దేవర చిత్రం జపాన్లో మళ్ళీ రిలీజ్ కావడం తో అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమంలో మొన్నటి వరకు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమా ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం సక్సెస్ మీట్ కు హాజరై ఆకట్టుకున్నారు. తన ప్రసంగంతో ఆడియన్స్ ని ఫిదా చేశారు. యంగ్ హీరోల్లోనూ ఫుల్ జోష్ నింపారు. ఇక నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫిలిం అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ అత్యంత భారీ గా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉరకలేశారు.

Jr NTR Planning for Huge Meeting with them

జూనియర్ ఎన్టీఆర్ కు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తన అభిమానులపై ఎంతటి ప్రేమ చూపిస్తారు ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే నిన్నటి ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. తమ అభిమాన హీరో కళ్ళ ఎదుటే ఉండడంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ కూడా తమ అభిమానుల ఉత్సాహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్ ఇచ్చారు.

త్వరలోనే మీ అందరితో భారీ ఎత్తున సమావేశం నిర్వహిస్తానని అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అభిమానులకు వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న కారణంగా డిలే చేస్తున్నానని, ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారని చెప్పారు. పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నానని ఫ్యాన్స్ తో తానే స్వయంగా చెప్పారు. కొద్దిపాటి సమయం ఇస్తే అభిమానులతో సమయం గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. సమ్మర్ పూర్తయ్యాక ఎన్టీఆర్ తన అభిమానులతో భారీ ఎత్తున సమావేశం కానున్నారని తెలుస్తోంది.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం బాలీవుడ్ ఫిలిం వార్ 2ను మరింత శ్రద్ధగా చేశాను అని చెప్పారు. ఆ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుందని, తన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక త్వరలోనే డ్రాగన్ సినిమా కూడా పూర్తవుతుందని, ఏప్రిల్ నెలలోనే తన షూటింగ్ పార్ట్ ప్రారంభం కాబోతుందని చెప్పుకొచ్చారు. అంతకంటే ముందు ఏప్రిల్ 18న తన అన్న కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రాబోతుందని, నందమూరి అభిమానులు అందరూ ఆదరించాలని కోరారు. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్లలో అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలసు నిర్మించారు. శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఇది కళ్యాణ్ రామ్ కెరియర్ లో 21వ చిత్రం కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X