3000 కోట్ల టార్గెట్ తో ఎన్టీఆర్.. టాలీవుడ్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ ఏంటో తెలుసా?
నటీనటుల పారితోషికాలు, సాంకేతిక విలువలు పెరుగుతుండటంతో సినిమా నిర్మాణ వ్యయం నానాటికీ పెరిగిపోతోంది. భారీ స్టార్ క్యాస్టింగ్, పాటల చిత్రీకరణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు ఫారిన్‌లో షూటింగ్‌లు కలుపుకుని సినిమాకు బడ్జెట్ ఎక్కడికో వెళ్లిపోతోంది. ఇక పాన్ ఇండియా కల్చర్ మొదలయ్యాక.. సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు పలు ఇండస్ట్రీలకు చెందిన వారిని తీసుకుంటున్నారు. అయితే ఇది నానాటికీ తీవ్రం కావడంతో నిర్మాతల జేబులు గుళ్లవుతున్నాయి.
భారతీయ చిత్రాలు 100 కోట్లు దాటుతాయా అని ఒకప్పుడు అనుకునేవారు కానీ ఇప్పుడు 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు కూడా దాటేసి హాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గేది లేదని నిరూపించాయి. హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించింది. హిందీ తర్వాత తమిళ్, తెలుగు చిత్ర సీమలు భారీ బడ్జెట్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఈ విషయంలో టాలీవుడ్ ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. బాహుబలి సిరీస్, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, గేమ్ ఛేంజర్ తదితర సినిమా బడ్జెట్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. మన మార్కెట్ పాన్ ఇండియానే కాదు, ఏకంగా ఖండాంతరాలు దాటిపోయి కోట్ల వర్షం కురిపిస్తోంది. గతేడాది విడుదలైన ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ రూ.1200 కోట్లు, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఏకంగా 1900 కోట్ల వసూళ్లు సాధించాయి. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో పుష్ప 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీగా నిలవడం తెలుగు సినిమాకు గర్వకారణం. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయి సినిమాలు రావడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచాయి. పుష్ప 2 సినిమా రికార్డులను బద్ధలు కొట్టడం ఒక్క సినిమాకే ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అదే SSMB 29.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం అది కూడా మహేశ్ బాబు లాంటి సూపర్‌స్టార్‌తో కావడంతో ఈ సినిమాపై చిత్ర సీమలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ డే, టోటల్ కలెక్షన్స్‌పై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. ఈ సినిమా అలవోకగా రూ.700 నుంచి రూ.1000 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని మహేశ్ అభిమానులు పందెలు కాసుకుంటున్నారు. లాంగ్ రన్‌లో రూ.4000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమాయే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ నుంచే తొలి పాన్ వరల్డ్ చిత్రంగా ఎస్ఎస్ఎంబీ 29 నిలవనుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఒడిషాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేని పరిస్ధితి . అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి - మహేశ్ చిత్రం థియేటర్‌లలో రావడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని అంటున్నారు.
అయితే ఈ లోపే మరో తెలుగు చిత్రం తొలి పాన్ వరల్డ్ మూవీగా నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అది మరేదో కాదు ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి తొలి పాన్ ఇండియా వరల్డ్ మూవీగా నిలవనుంది. ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్లిన ఈ సినిమాలో కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. మైత్రీ అధినేతలలో ఒకరైన రవిశంకర్ చేసిన కామెంట్స్ వీటిని మరింత పెంచుతున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఆయన దూకుడు చూస్తుంటే రెండేళ్ల లోగానే డ్రాగన్‌ను రిలీజ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ గత చిత్రాలు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్‌లను ఆయన వేగంగానే పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమా అని అనౌన్స్ చేశారు. అయితే దీని విడుదలకు మూడేళ్ల సమయం కనుక పడితే ఖచ్చితంగా డ్రాగన్ .. తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా చరిత్రకెక్కనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని నిర్మాతలు గట్టి పట్టుదలగా ఉన్నారు. మరి రాజమౌళి - ప్రశాంత్ నీల్ మధ్య జరిగే వార్‌లో ఎవరు ముందొస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











