విధ్వంసానికి సిద్ధమైన జూ ఎన్టీఆర్.. ఇంటర్నెట్ షేక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా 'ఆర్ఆర్ఆర్', 'దేవర' చిత్రాలతో వెండితెరపై వెలిగారు. తన నట విశ్వరూపంతో థియేటర్లలో దుమ్ములేపారు. యాక్షన్, మాస్ కంటెంట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. డ్యుయల్ రోల్ లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇక నెక్ట్స్ రాబోయే చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తారక్ తన రాబోయే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అప్ కమింగ్ చిత్రాలపై ఫుల్ ధ్యాస పెట్టారు.

ఇక ఎన్టీఆర్ నుంచి రాబోయే చిత్రాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్' ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. ఇక మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్'(ఎన్టీఆర్31)పై ఫోకస్ పెట్టారు. కాగా తాజాగా ఎన్టీఆర్ అన్నీ పనులు ముగించుకొని షూటింగ్ కు హాజరవుతున్నారు.

Jr NTR Prashanth Neel Movie Shooting Resume

'కేజీఎఫ్', 'సలార్' వంటి యాక్షన్ చిత్రాలను డైరెక్ట్ చేసి సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మాస్ ఇంజిన్స్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న'డ్రాగన్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగు రోజుల పాటు సాగింది. 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం యూనిట్ 2వ షెడ్యూల్ కు సిద్దమైంది.

డ్రాగన్ మొదటి షెడ్యూల్ ఫిబ్రవరిలో పూర్తవ్వగా, 2వ షెడ్యూల్ ను ఏప్రిల్ 22 నుంచి ప్రారంభించబోతున్నారు. కర్ణాటకలో షూట్ జరగబోతుందని సమాచారం. మరోవైపు సముద్ర తీరాన కొన్ని కీలక సన్నివేశాలను ఎన్టీఆర్ పై చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రేపటి నుంచి షూటింగ్ ప్రారంభమనే విషయాన్ని నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఏదేమైనా ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యినందుకే అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ లేటెస్ట్ విజువల్స్ ను అభిమానులు లైక్స్, షేర్లతో వైరల్ గా మారుస్తుండటంతో తారక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు. ఇక హృతిక్ రోషన్ తో కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ 'వార్2' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్, వై రవి శంకర్, నవీన్ ఏర్నేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిగితా కాస్టింగ్ గురించి మున్ముందు అప్డేట్స్ రానున్నాయి. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలోని 'దేవర 2' చిత్రంలోనూ నటించ బోతున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr prashanth neel dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X