పాన్ ఇండియా దర్శకుడితో ఎన్టీఆర్.. అసలు కథ ఇదేనట!
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకున్న అతికొద్ది మంది హీరోల్లో మాత్రం తారక్ ఒక్కడే. తారక్ టాలెంట్ ఏమిటో బాలీవుడ్ అగ్ర హీరోలకు కూడా తెలుసు. తారక్ డ్యాన్స్ కోసమే హిందీ ఆడియెన్స్ ఎక్కువగా అతను సినిమాలకు ఎట్రాక్ట్ అవుతున్నారు. హిందీ డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ అందుతోంది. ఇక ప్రస్తుతం RRRతో బిజీగా ఉన్న ఈ హీరో చూస్తుంటే భవిష్యత్తులో అంతకు మించి అనేలా మరికొన్ని పాన్ ఇండియా సినిమాలతో రెడీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నెక్స్ట్ అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది గాని ఇంకా అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఆ సంగతి పక్కనపెడితే సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సినిమా ఒక పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కే అవకాశం ఉందట.

పాకిస్థాన్ - ఇండియా విడిపోయిన పాయింట్ తో సినిమా కథ నడుస్తుందట. ఇండో పాక్ వార్ కి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ఉంటాయని సమాచారం. ఆ సినిమాలో KGF కంటే హై రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయట. అలాగే ఎమోషన్స్ కూడా హై రేంజ్ లో ఉంటాయని సమాచారం. మరి దర్శకుడు ఆ సినిమాలో హీరోను ఎలా చూపిస్తాడో చూడాలి అంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది గాని రెబల్ స్టార్ మరో మూడేళ్ళ వరకు మరో సినిమా ఓకే చేయలేని పరిస్థితి. అందుకే ప్రశాంత్.. జూనియర్ ఎన్టీఆర్ తోనే వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











