RRR సెట్ లో రామరాజు, భీమ్ ముచ్చట్లు.. ఎంత సరదాగా ఉన్నారో.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమా RRR. ఈ సినిమా కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా 8 నెలలు ఉంది.అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వలన అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవల సెట్స్ లో తారక్, చరణ్ లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఖాళీ సమయాల్లో.. స్టార్స్ అందరూ

ఖాళీ సమయాల్లో.. స్టార్స్ అందరూ

RRR సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు కొంతమంది టాలెంటెడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అజయ్ దేవ్ గన్, శ్రియా అలాగే తమిళ దర్శకుడు, నటుడు సముథ్రఖని కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్థాయి, అనుభవం ఉన్న నటీనటులు. ఇక ఖాళీ సమయాల్లో వీళ్ళు ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటున్నారు.

లీక్ అవ్వకుండా.. రాజమౌళి జాగ్రత్తలు

లీక్ అవ్వకుండా.. రాజమౌళి జాగ్రత్తలు

ఇక సినిమాకు సంబంధించిన చిన్న పోస్టర్ విడుదలైన కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. దర్శకుడు రాజమౌళి అయితే ఏ చిన్న సీన్ కూడా లీక్ అవ్వకూడదని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇక సినిమా రావడానికి చాలా సమయం ఉన్నప్పటికీ రెగ్యులర్ గా ఎదో ఒక అప్డేట్ తో హ్యాపీ చేస్తున్నారు.

రామరాజు, భీమ్ ముచ్చట్లు

రామరాజు, భీమ్ ముచ్చట్లు

ఇక చాలా కాలం తరువాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించిన లొకేషన్స్ ఫొటోలను రిలీజ్ చేశారు. అందులో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ కనిపిస్తున్నారు. ఆ ఫ్రేమ్ అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. రియల్ లైఫ్ లో తారక్, ఎన్టీఆర్ ల మధ్య సంభాషణలను వినాలని ఉందని నెటిజన్లు చాలానే కామెంట్స్ చేస్తున్నారు.

షూటింగ్ ఎంతవరకు వచ్చింది అంటే..

షూటింగ్ ఎంతవరకు వచ్చింది అంటే..

ఇక సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అంటే.. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల్ని షూట్ చేయడంలో బిజీగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక కాస్త గ్యాప్ లోనే ఇద్దరు హీరోలు ఇలా ముచ్చట్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ఫినిష్ అయితే వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కావాలని రాజమౌళి అడుగులు వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X