NTR's Video: మళ్లీ కలుస్తున్నాం.. ఆ ఇద్దరిపై నిందలు వేయకండి.. దేవర ఈవెంట్ క్యాన్సిల్ తర్వాత ఎన్టీఆర్ ఎమోషనల్

యంగ్ టైగర్ జూనియర్ నటించిన దేవర చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో గ్రాండ్‌గా ఈవెంట్‌ను జరిపించేందుకు వేదికను అందంగా ముస్తాబు చేశారు. ఈవెంట్‌లో పాల్గొనే ముఖ్య అతిథులు తీవ్రిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, రాజమౌళి వేదిక వద్దకు చేరుకొన్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఈవెంట్‌ రద్దు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం ప్రీ రీలీజ్ వేడుకకు పరిమితి కంటే ఎక్కువగా అభిమానులు పోటెత్తారు. దాంతో సభావేదిక కిక్కిరిసిపోయింది. వేదిక వద్ద ఉన్న వారికంటే అదికంగా హోటల్ బయట ఉన్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఉద్రేకంగా వ్యవహరించడంతో హోటల్ పాక్షికంగా ధ్వంసమైంది.

Jr NTR released Emotional Video After Devara Pre Release Event Cancelled

దాంతో ఈవెంట్‌ను నిర్వహించలేమనే అభిప్రాయం నిర్వాహకుల్లో వ్యక్తమైంది. పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. ఎన్టీఆర్, జాన్వీ, ముఖ్య అతిథిులు వస్తే మరింత ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఎదురయ్య అవకాశముందని హెచ్చరికలతో ఈవెంట్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ వీడియోను రిలీజ్ చేసి.. తన భావోద్వేగాన్ని కురిపించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అభిమాన సోదరులకు నమస్కారం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగకపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా నాకు చాలా బాధగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవర మూవీ గురించి, దేవర షూటింగులో పడిన కష్టం గురించి చెప్పాలని చాలా ఆసక్తగా ఉన్నాను. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఈవెంట్ రద్దు అయింది అని ఎన్టీఆర్ అన్నారు.

మళ్లీ చెబుతున్నాను. మీ కంటే నా బాధ ఎక్కువ కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వెనుక నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్లను తప్పు పట్టడం సరికాదు. ముందుగా ఈ కురిపించే ప్రేమకు ఆజాన్మంతం రుణపడి ఉంటాను. ఈ రోజు కలువకపోయినా.. సెప్టెంబర్ 27వ తేదీన మళ్లీ కలువబోతున్నాం. దేవర సినిమాను మీరందరూ చూడబోతున్నారు అని ఎన్టీఆర్ ఉద్వేగంతో అంటూ కనిపించారు.

దేవర సినిమా చూసిన తర్వాత నేను ఎప్పుడూ చెప్పినట్టే మీరు కాలర్ ఎగురేసుకొనే చిత్రం చూశామనే ఫీలింగ్ గ్యారెంటి. దాని వల్ల వచ్చే ఆనందం ఎంతో చెప్పలేను. అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. కొరటాల శివ ఎంతో గొప్పగా తీశాడు. మీరందరూ సినిమా చూడండి.. అంతేకంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం కావాలి. నాకు చాలా అవసరం. మీ ఆశీర్వచనం మీరు అందిస్తారని కోరుకొంటున్నాను అని అన్నారు. చివరగా మీరందరూ ఇంటికి క్షేమంగా వెళ్తారని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.

More from Filmibeat

Read more about: jr ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X