Bimbisara Release Trailer: ఎన్టీఆర్ వదిలిన మరో పవర్ఫుల్ ట్రైలర్.. జగత్ జజ్జరికా!
కళ్యాణ్ రామ్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ బింబిసార ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా రెండవ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక సెకండ్ ట్రైలర్ కూడా ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్స్ తో పాటు అలాగే ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.
చూస్తూ ఉంటే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే దక్కించుకునే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. 'హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు ఆపే రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణ బిక్ష. ఎదిరిస్తే మరణం.. జగత్ జజ్జరికా..' అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఎంతో భయంకరంగా ఉంది. చూస్తూ ఉంటే ఈ సినిమాలో బాంబిసారగా కళ్యాణ్ రామ్ అతి క్రూరంగా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది.
అలాగే ఒక మంచికి చెడుకి మధ్యలో జరిగిన టైమ్ ట్రావెల్ సినిమా అనే చిత్ర యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కథ చారిత్రాత్మక అంశం నుంచి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బింబిసారుడిని మళ్ళీ రప్పించడంతో ఎలాంటి పరిణామాలు క్రియేట్ అవుతాయనేది సినిమాలో అసలైన పాయింట్ అని అర్ధమవుతుంది. ఇక బింబిసార సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ తో మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమాను చూసినట్లుగా కళ్యాణ్ రామ్ వివరణ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ ప్రత్యేకంగా దర్శకుడుని అలాగే చిత్ర యూనిట్ సభ్యులను కూడా అభినందించారు అని తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని ధీమాతో ఎన్టీఆర్ చెప్పినట్లుగా కళ్యాణ్ రామ్ వివరణ ఇచ్చారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ రాబోతున్నట్లుగా ఇటీవల ఆఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











