ఎన్టీఆర్, రోజాకి మాట్లాడే హక్కు లేదా? సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్

లేటెస్ట్ గా టాలీవుడ్ లో నటి సమంత అలాగే తన మాజీ భర్త నాగ చైతన్య విషయంలో ఎలాంటి దుమారం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాగా సినిమా వాళ్ళు అంటే అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంటుందో మరోసారి క్లియర్ అయ్యింది అని చెప్పాలి. కాగా అక్కినేని నాగ చైతన్య తన మాజీ భార్య విడాకులకు కారణం ఇది అంటూ ఓ సాటి మహిళా మినిష్టర్ కొండా సురేఖ చేసిన తీవ్ర వ్యాఖ్యలు టాలీవుడ్ హీరోలని కదిలించాయి.

చిన్న హీరోలు నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు కూడా సమంత, నాగ చైతన్య విషయంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ని దుయ్యబడుతున్నారు. ఇలా సినిమాకి చెందిన అనేకమంది ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి కావడం అనేది నిజంగా ఒక మంచి విషయం. తమ సినీ కుటుంబానికి చెందిన వారిపై ఇలాంటి చర్యలు జరిగితే ప్రతి చర్య ఇలానే ఉంటుంది అని ఒక రుచి చూపించారు.

jr ntr roja facing negaitive comments over their response on konda surekha akkineni issue

కాగా ఇదంతా బాగానే ఉంది కానీ ఈ కాంట్రవర్సీ విషయంలో కొందరు విషయంలో మాత్రం గట్టి విమర్శలు లేవనెత్తుతున్నాయి. అదేంటి సమంత, నాగ చైతన్య మీద పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళ మీద విమర్శలా? అంటే అవును ఖచ్చితంగా పడుతున్నాయి. కాగా కొండా సురేఖ విషయంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రముఖ సీనియర్ నటి ఏపీ మాజీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి చేసిన కామెంట్స్ కి వారిపై పెద్ద ఎత్తున విమర్శలు పడుతున్నాయి.

రోజా కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ సమంతపై సతి మహిళగా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని నీతులు చెప్పి తన గతాన్ని మర్చిపోయింది అంటూ గట్టి విమర్శలు పడుతున్నాయి. కాగా రోజా గతంలో పవన్కళ్యాణ్ పర్శనల్ లైఫ్ కోసం కానీ తన మాజీ భార్య దేశాయ్ కోసం కానీ ఎలాంటి మాటలు మాట్లాడిందో అన్నీ గుర్తు ఉన్నాయని ఇపుడు అలాంటి వ్యాఖ్యలు చేసిన రోజా కూడా నీతులు చెబుతుంది అని మెగా అభిమానులు సహా సామాన్య నెటిజన్స్ కూడా రోజా స్టాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

jr ntr roja facing negaitive comments over their response on konda surekha akkineni issue

ఇక జూనియర్ ఎన్టీఆర్ పై కూడా నందమూరి అభిమానులు నిరాశ చెందారు. స్వయానా తనకి మేనత్త అయినటువంటి నారా భువనేశ్వరిపై గతంలో ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేసినపుడు ఎందుకు స్పందించలేదు అని సొంతం కుటుంబం మనిషిని దారుణంగా మాట్లాడితే ఎలాంటి రియాక్షన్ ఇవ్వని తారక్ సమంతని అంటే మాత్రం వెంటనే స్పందించారు అని అంటున్నారు.

ఇప్పుడు స్పందించినట్టే అప్పుడు భువనేశ్వరి గారి విషయంలో కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అని సదరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహా నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ప్రస్తుతం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం "దేవర" థియేటర్స్ లో రిలీజ్ కి రాగా భారీ వసూళ్లతో ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తుంది.

More from Filmibeat

Read more about: jr ntr roja devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X