For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లికి సిద్ధమైన ఎన్టీఆర్ విలన్, ప్రేయసితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. రొమాంటిక్ ఫొటోస్ లీక్!

  |

  సినిమా ప్రపంచంలో ఎంత స్టార్ డమ్ కలిగి ఉన్నా కూడా కొంత మంది సినీ తారలు వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి చాలా తక్కువ ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా బయటకు కనిపించకుండా ప్రైవేట్ లైఫ్ ను ఎంజాయ్ చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటి అతి తక్కువ మంది నటీనటులలో విద్యుత్‌ జమ్వాల్‌ ఒకరు. ఈ వెండితెర విలన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర హీరోలకు ప్రతినాయకుడిగా కనిపించాడు. ఇక చాలా రోజుల తర్వాత విద్యుత్‌ జమ్వాల్‌ ఒక సరికొత్త వార్తతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

  ఎక్కువగా విలన్ పాత్రల్లో

  ఎక్కువగా విలన్ పాత్రల్లో

  జమ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన విద్యుత్ కేవలం నటుడు మాత్రమే కాదు. అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక అనుభవం ఉంది. అలాగే స్టంట్ పర్ఫార్మర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండితెరపై ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించిన విద్యుత్‌ జమ్వాల్‌ హీరో రేంజ్ పెరగాలంటే తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండేలా హైలెట్ చేసుకునేవాడు. ఒకప్పుడు తమిళ్ సినిమాలతో ఎక్కువగా బిజీ అయినటువంటి విద్యుత్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా తీరికలేకుండా గడుపుతున్నాడు.

  ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా

  ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా


  జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన శక్తి సినిమా విద్యుత్‌ జమ్వాల్‌ ఒక విలన్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని అతని పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో ఒక విలన్ పాత్రలో కనిపించాడు. మొత్తానికి తెలుగులో అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా విద్యుత్‌ జమ్వాల్‌ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

  తమిళ్ లో పవర్ఫుల్ గా

  తమిళ్ లో పవర్ఫుల్ గా

  శక్తి, ఊసరవెల్లి వంటి సినిమాలు కమర్షియల్ గా అంతగా ఆడకపోయినా కూడా అతని టాలెంట్ ఏమిటో మిగతా ఇండస్ట్రీకు కూడా బాగా తెలిసింది. ఆ తర్వాత అతను కోలీవుడ్లో బిజీ నటుడిగా కూడా కనిపించాడు. ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్ విజయ్ కాంబినేషన్లో వచ్చిన తుపాకి సినిమా మెయిన్ విలన్ గా కూడా నటించాడు. అందులో ఉగ్రవాది గా నటించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బిల్లా 2 కూడా అజిత్ కుమార్ కు ఆపోజిట్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించాడు.

  విద్యుత్‌ జమ్వాల్‌ ప్రేయసి

  విద్యుత్‌ జమ్వాల్‌ ప్రేయసి

  సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ విద్యుత్‌ జమ్వాల్‌ చాలా తక్కువగా తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక విద్యుత్‌ జమ్వాల్‌ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక అది నిజమేనని ఈ నటుడు నిరూపించాడు. తన చిరకాల ప్రేయసి నందితా మహతానీతో కలిసి ఉన్న చిత్రం ఇంటర్నెట్‌లో ఇప్పుడు వైరల్ గా మారింది.

  Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
  మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్..

  మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్..

  తాజ్ మహల్ ముందు విద్యుత్‌ జమ్వాల్‌ తన ప్రేయసితో రొమాంటిక్ గా స్టిల్ ఇచ్చాడు. నందిత చేతులను పట్టుకుని కనిపించిన ఈ నటుడు ఎంగేజ్మెంట్ రింగ్ హైలెట్ అయ్యేలా క్చూయించాడు. వీరి నిశ్చితార్థం 3 రోజుల క్రితం సైలెంట్ గానే జరిగినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో హడావుడి లేకుండా పెళ్లి చేసుకోవాడానికి ఈ జంట సిద్ధమవుతున్నట్లు సమాచారం.

  English summary
  Jr Ntr shakthi movie villain Vidyut Jammwal engagement with girlfriend photos leak,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X