‘ద మ్యాన్ బిఫోర్ ద స్ట్రామ్’.. హాట్ టాపిక్‌గా మారిన ఎన్టీఆర్ పోస్ట్
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే అతడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో తారక్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. రాజమౌళి 'RRR' షూటింగ్ స్పాట్‌లో కూర్చుని ఉన్న ఫొటోను తారక్ షేర్ చేశాడు. అంతేకాదు, దీనికి 'ద మ్యాన్ బిఫోర్ ద స్ట్రామ్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అలాగే, రేర్ పిక్ కావడంతో దీన్ని జూనియర్ అభిమానులతో పాటు జక్కన్న ఫ్యాన్స్ తమ తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

మరోవైపు, తమ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలనుకుంటున్న 'RRR' టీమ్.. ముందుగా ఎన్టీఆర్ రోల్‌కు సంబంధించిన లుక్ రివీల్ చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కొమరం భీంగా కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ను త్వరలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పోస్టర్‌ను అక్టోబర్ 22న విడుదల చేస్తారట. ఆరోజు కొమరం భీం జయంతి ఉండడమే దానికి కారణం అని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం తారక్ ఎంతగానో కష్టపడుతున్నాడు. సరైన ఫిజిక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











