For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR షూటింగ్‌లో దిగాలుగా రాజమౌళి.. జీవితంలో మొదటి సారి ఇలా అంటున్న ఎన్టీఆర్!

  |

  'బాహుబలి' తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం 'ఆర్ఆర్ఆర్' కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోల నటిస్తూ ఉండడమే కాక తమిళ హిందీ భాష కు చెందిన స్టార్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.. దీంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 2020 వ సంవత్సరంలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 13 దసరా సందర్భంగా విడుదల అవుతోంది.. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ భారీగా ప్లాన్ చేయడంతో సినిమా యూనిట్ అంతా బయలుదేరి కూడా వెళ్లారు. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ప్రతిరోజు వార్తల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా యూనిట్ మొన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదల చేసిన దోస్తీ సాంగ్ అయితే ఇప్పటికీ ఏదో ఒక చోట ట్రెండ్ అవుతూనే ఉంది.

  అయితే ఉక్రెయిన్ వెళ్లినప్పటి నుంచి అక్కడ షూటింగ్ కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తున్న ఈ యూనిట్ తాజాగా ఇచ్చిన అప్డేట్ మాత్రం అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది. విషయం ఏమిటంటే ఎన్టీఆర్ రాజమౌళి ఇద్దరూ మెడలో ఐడి కార్డులు వేసుకున్న ఫోటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. అంతేకాక ఇలా ఐడి కార్డులు వేసుకుని కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందని అయితే సినిమా సెట్ లో మాత్రం ఇలా ఐడి కార్డు వేసుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. మరో పక్క ఫోటోలో రాజమౌళి కూడా కనిపిస్తూ ఉండగా అందులో ఆయన దిగాలుగా కనిపిస్తున్నారు, బహుశా షూట్ వలన వచ్చిన అలసట అయుండచ్చు. సాధారణంగా మన స్టూడియోలలో లేదా సినిమా షూటింగ్ పరిసరాల్లో మన నటీనటులకు తగిన గుర్తింపు ఉంటుంది.. ఫలానా నటుడు ఎవరు ? ఫలానా టెక్నీషియన్ ఎవరు ? అనే దాని మీద అందరికీ అవగాహన ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చేస్తున్నది వేరే దేశం కాబట్టి అక్కడి వారికి ఎవరెవరు ఏమేం చేస్తారు ? అనే విషయం మీద అవగాహన ఉండదు.

  Jr NTR shares pictures from RRR set with ID cards

  అందుకే ముందు జాగ్రత్తగా జక్కన్న ఇలా హీరో మొదలు యూనిట్ అందరికీ ఈ ఐడి కార్డులు ప్రింట్ చేయించినట్లు తెలుస్తోంది. అలాగే సెట్ లోకి రావాలంటే తప్పనిసరిగా ఈ ఐడి కార్డు ధరించాల్సిందేననే రూల్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.. అంత పగడ్బందీ గా చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుని తీరుతుంది అని భావిస్తున్నారు మరి చూడాలి ఇది ఎంతవరకు సఫలం అవుతుంది అనేది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డును సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అలియా భట్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 900 కోట్ల బిజినెస్ చేసింది. ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బహుబలి సినిమాని బీట్ చేస్తుందని భావిస్తున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  RRR shooting is taking place in Ukraine. final schedule in Ukraine heavily planned, the entire film unit also left there. NTR shared photos of him self and Rajamouli wearing ID cards around their necks on his social media platform. It has also been revealed that ''Been ages since I wore an ID card! My first ever on sets!!''. Rajamouli is also seen in the photo on the other side, in which he looks awkward, possibly due to the fatigue caused by the shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X