మహేష్ బాబు - రాజమౌళి సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ సెటైర్.. అదే నిజమవుతుందా?

దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమాతో బాహుబలి కి మించిన విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలని వెండితెరపై పవర్ఫుల్ గా చూపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు సినిమాతో రాబోతున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఆ కాంబినేషన్ పై ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేయడం విశేషం.

స్టార్ క్యాస్టింగ్..

స్టార్ క్యాస్టింగ్..

దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించాడు. ఇక అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ తేజ్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అలాగే హీరోయిన్ అలియా భట్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్

భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్

కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా జనాల్లో దర్శకుడు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కరెక్ట్ గా నిర్వహిస్తున్నారు. ఇటీవల ముంబైలో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా శివకార్తికేయన్ ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

మహేష్ బాబుతోనే..

మహేష్ బాబుతోనే..

ఇక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. ఇక ఇటీవల దర్శకుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టు మహేష్ బాబు తోనే ఉంటుంది అని ఆ సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగానే తెరపైకి రాబోతున్నారు క్లారిటీ అయితే ఇచ్చారు.

ఎన్టీఆర్ సెటైర్

ఎన్టీఆర్ సెటైర్

మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రాజెక్టు ఎప్పుడు వస్తుంది అనే విషయం పై అనేక రకాల ప్రశ్నలు ఎదురవ్వగా పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. తప్పకుండా సినిమా 2026 లో వస్తుంది అంటూ సెటైర్ కూడా వేశాడు. ఆ తర్వాత మెల్లగా ఆలోచించి చర్చలతోనే వచ్చే ఏడాది మొత్తం పూర్తవుతుంది అని ఇక ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే 2025 లో మళ్లీ ముందుకు వస్తారు అని సెటైర్ వేశాడు.

Recommended Video

SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
అది కూడా నిజం కావచ్చు..

అది కూడా నిజం కావచ్చు..

ఇక జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన తర్వాత పక్కనే వున్న రామ్ చరణ్ కూడా అది కూడా కరెక్ట్ అంటూ.. అది కూడా పాండమిక్ లేకపోతేనని ఎలాంటి సమస్యలు రాకపోతే ఆ సమయానికి రావచ్చు అని మరొక కౌంటర్ కూడా వేశాడు. ఇక వీరిద్దరిని చూసిన రాజమౌళి తనలో తనే నవ్వుకున్నాడు.

ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది కూడా నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకు వచ్చినా కూడా అంతకుమించి అనేలా ఉంటుంది.. కానీ సమయం చాలా ఎక్కువగా తీసుకుంటాడు. ఇక మహేష్ సినిమా విషయంలో ఎన్ని రోజుల సమయాన్ని తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X