Devara: ఎన్టీఆర్‌కు చంద్రబాబు గుడ్ న్యూస్.. సీఎం, డిప్యూటీ సీఎంపై తారక్ కామెంట్స్ వైరల్
తెలుగు సినిమా రంగం నుంచి ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపించి సత్తా చాటుతోన్నాయి. అలాంటి వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమా ఒకటి. పవర్‌ఫుల్ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దేవరకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఎన్టీఆర్ దీనికి ఏం చేశాడో మీరే చూడండి!
దేవరగా వస్తున్నాడు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీనే 'దేవర'. కొరటాల శివ తీసిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రలు చేశారు.

ఎన్టీఆర్ పేరు రచ్చ
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేశారు. అలాగే, ఇండియా వైడ్‌గా కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. దీనికితోడు ఓవర్సీస్‌లో టికెట్ల బుకింగ్ కూడా మొదలైంది. దీంతో ఎన్టీఆర్ పేరు వరల్డ్ వైడ్‌గా ట్రెండింగ్ అవుతోందని చెప్పొచ్చు.
స్పెషల్ షోల కోసం
టాలీవుడ్ నుంచి వచ్చే భారీ చిత్రాలకు స్పెషల్ షోలు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెసలుబాటు కల్పించలేదు. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడనుంది. రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతీ రోజు 5 షోలకు ఓకే చెప్పింది.

టికెట్ రేట్లు పెంపు
'దేవర' సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‍లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై అదనంగా రూ. 135 పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ. 110, లోయర్ క్లాస్ టికెట్‍పై రూ. 60 అధికం చేసేందుకు అనుమతి ఇస్తూ ఓ జీవోను జారీ చేసింది.
సీఎంకు థ్యాంక్స్
'దేవర' మూవీకి టికెట్ రేట్ల పెంపుపై ఎన్టీఆర్ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'దేవర మూవీ టికెట్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసి, తెలుగు సినిమాకు మద్దతు ప్రకటించిన సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‍కు కూడా థ్యాంక్స్ చెబుతున్నా' అని అన్నాడు.
నాగ వంశీ అలా
'దేవర'పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాత నాగ వంశీ కూడా స్పందించారు. ఈ మేరకు 'సరైన థియేటర్ అనుభవాన్ని అందించాలన్న మా కోరికను మన్నించిన ఏపీ సీఎం చంద్రబాబు గారికి, పవన్ కల్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దేవర విధ్వంసం సెప్టెంబర్ 27న ప్రారంభం కాబోతుంది' అని రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











