Jr NTR ఇంట్లో హాలీవుడ్ సెలబ్రిటీ.. రాత్రి గ్రాండ్ పార్టీ.. ఎన్టీఆర్‌తో స్పెషల్ మూవీ?

సుమారు ఐదు, ఆరు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటించి తారక్ నటనకు యావత్ ప్రపంచమే ఫిదా అయింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో తారక్, చెర్రీల పేర్లు మరింత మారుమోగిపోయాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో గ్రాండ్ గా ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీ ఎందుకు వంటి తదితర విషయాల్లోకి వెళితే..

శివ టు ప్రశాంత్:రాజమౌళితో రౌద్రం.. రణం.. రుధిరం (RRR) సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలనే ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో తారక్ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ వచ్చింది. NTR30 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రానుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

JR NTR Special Party To Amazon Studios Vice President James

బుధవారం రాత్రి:NTR30 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలతో అదరగొడుతాడని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో దాదాపుగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ గ్లామర్ డాల్, అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేయనుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇంట్లో బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి గ్రాండ్ పార్టీ ఒకటి జరిగింది.

స్పెషల్ పార్టీ:RRR మూవీలో ఎన్టీఆర్ నటనకు ఎంతో ఫిదా అయ్యారు. అందులో అమెజాన్ స్టూడియోస్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఎన్టీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు తారక్ ఇంటికి వచ్చారు. కేవలం తారక్ ను కలవడం కోసమే అమెరికా నుంచి వచ్చారట. జేమ్స్ వచ్చిన సందర్భంగా చిత్రసీమలోని ప్రముఖులను పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చారు ఎన్టీఆర్.

JR NTR Special Party To Amazon Studios Vice President James

ప్రముఖుల హాజరు:తారక్ ఇచ్చిన స్పెషల్ పార్టీలో దర్శక ధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, దిల్ రాజు సోదరుడు శిరీష్, వైజయంతీ మూవీస్ అశ్వినీదత్ కుమార్తె స్వప్న సినిమాస్ నిర్మాత స్వప్న దత్ సితార ఎంటర్టైన్ మెంట్స్ సూర్యదేవర నాగవంశీ హాజరు అయ్యారు. స్వప్న, నాగవంశీ పార్టీలో కొద్దిసేపు సందడి చేసి వెళ్లినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

అటెండ్ కానీ వాళ్లు:దిల్ రాజు ఢిల్లీలో ఉండటంతో పార్టీకి రాలేకపోయారట. అలాగే పుష్ప 2 మేకింగ్ కోసం సుకుమార్ విశాఖకు వెళ్లారట. ఇలా ఆహ్వానం ఉన్నా వీళ్లు హాజరుకాలేకపోయారట. అయితే ప్రస్తుతం తారక్ ను అమెజాన్ స్టూడియోస్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ కలవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఎందుకోసం వచ్చారు అంటూ ఆరా తీస్తున్నారు.

JR NTR Special Party To Amazon Studios Vice President James

ఓటీటీ రైట్స్.. స్పెషల్ మూవీ:ప్రస్తుతం NTR30 మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంటుందా? అనే చర్చ మొదలైంది. అందుకోసమే జేమ్స్ ఇక్కడికి వచ్చారా? అని డౌట్ పడుతున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందన్న తారక్ ను హీరోగా అమెజాన్ ఇంటర్నేషనల్ స్టూడియోస్ ఏమైనా స్పెషల్ మూవీ ప్లాన్ చేస్తోందా? వంటి వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X