బాలా బాబాయ్ అంటూ అఖండ సినిమాపై ఎన్టీఆర్ రివ్యూ.. మరో యువ హీరో కూడా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ఒక సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తానికి అనుకున్నట్లుగానే అఖండ సినిమా మొదటి రోజు సాలీడ్ వసూళ్లను అందుకుంది. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి సినిమా సక్సెస్ అయినా కూడా మిగతా సినిమాల నిర్మాతలు కూడా చాలా ధైర్యం కలుగుతుంది. అందుకే అఖండ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ సినిమాను చూసిన కొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చూసి ప్రత్యేక శైలిలో ఒక మాటతో రివ్యూ కూడా ఇచ్చేశారు.

స్ట్రాంగ్ ఓపెనింగ్స్
నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేసాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన సింహ లెజెండ్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్ళీ మూడోసారి వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీసు వద్ద మొదటిరోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.

జై బాలయ్య అంటూ
సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా జై బాలయ్య అంటూ థియేటర్స్ లో నినాదాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ మూమెంట్స్ అయితే చాలా బలంగా ఉన్నాయని అంటున్నారు. ఓవర్సీస్ లో కూడా అదే రీ సౌండ్ వినిపిస్తోంది అంటే సినిమా స్థాయిలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ కూడా మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. ఇక బోయపాటి కూడా తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశాడు.

అఖండను చూసిన ఎన్టీఆర్
మొత్తానికి అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో మొదటి రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా చూసేసాడు. సినిమా పై పెరుగుతున్న అంచనాలను జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాటతో మరింతగా పెంచేశాడు. తనదైన శైలిలో చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక్క మాటలోనే రివ్యూ కూడా ఇచ్చేశాడు.
ఒక్క మాటలో రివ్యూ ఇచ్చేసిన ఎన్టీఆర్
గురువారం రాత్రి సోషల్ మీడియా లో ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే సినిమా చూశాను అంటూ బాలా బాబాయ్ కు అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో అయితే హార్డ్ కోర్ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video
నారా రోహిత్ కామెంట్
ఇక నారా రోహిత్ ఈ విదంగా పేర్కొన్నారు. బాల మామా నుండి ఇప్పటివరకు అత్యుత్తమ మాస్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన అఖండను ఇప్పుడే చూశాను. బోయపాటి గారు అనుకున్నది సాధించారు, మాస్ హిస్టీరియాని అత్యుత్తమ BGMతో పునర్నిర్వచించినందుకు థమన్ ను ప్రత్యేకంగా అభినందించాలి అంటూ నారా రోహిత్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ఇక మహేష్ బాబు కూడా అఖండ విజయంపై పాజిటివ్ గా స్పందించారు.


Click it and Unblock the Notifications











