సోషల్ మీడియాలో అలాంటి ఫొటోలు పంపే అమ్మాయిలకు హెచ్చరిక.. Jr ఎన్టీఆర్ స్పెషల్ వీడియో
ఇంటర్నెట్ ప్రపంచంలో రోజుకో క్రైమ్ స్టోరీ బయటపెడుతోంది. ఒక్క సెకనులలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలకు యువత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎక్కువగా ఆన్ లైన్ మోసల్లో అమ్మాయిలు బలవుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ ఘటనలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కేవలం ఘటనలపై చర్యలను తీసుకోవడమే కాకుండా జనాలు మోసపోకుండా ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమంలో ఒక బాగమయ్యారు.

పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు
గత పదేళ్లలో ఇంటర్నెట్ వాడకంలో ఎన్నో మార్పులు వచ్చాయి. చేతిలో మొబైల్ తోనే సగం పనులు చిటికెలో జరిగిపోతున్నాయి. అయితే స్మార్ట్ లైఫ్ కి అలవాటు పడిన తరువాత ఇంటర్నెట్ వరల్డ్ లో కొందరు ఆలోచిస్తున్న విధానం అనేక రకాల ఇబ్బందులను కలిగిస్తోంది. అమాయకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో పరిచయాలు బ్లాక్ మెయిల్, సూసైడ్ వరకు తీసుకువెళుతున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆలోచింపజేస్తోన్న వీడియో
హైదరాబాద్ సిటీ పోలీసులు విడుదల చేసిన ఒక వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో జాగ్రత్తలు తెలిపారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి కొందరు వారి ప్రయివేట్ ఫొటోలు కూడా పంపుతూన్నట్లు ఆ వీడియోలో చూపించారు. అనంతరం దుండగులు ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తారని కూడా హెచ్చరించిన విధానం ఆలోచింపజేస్తోంది.

జాగ్రత్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్ లైన్ పరిచాయలు అనుకోని కష్టాలనలకు కారణం కావచ్చు. దైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన విధానం నెటిజన్స్ ని ఎంతగానో ఆలోచింపజేస్తోంది.
Recommended Video

ఎన్టీఆర్ ఆ విషయాలను ఏ మాత్రం మరచిపోడు
జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా ఇలాంటి మంచి సందేశాత్మక వీడియోలను చాలానే చేశాడు. ముఖ్యంగా యాక్సిడెంట్ వంటి అంశాలపై నిత్యం ఎన్టీఆర్ జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అన్నయ్య జానకి రామ్, తండ్రి హరికృష్ణ ఇద్దరు కూడా యాక్సిడెంట్ లో చనిపోవడంతో మరో కుటుంబంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చే అభిమానులకు చెబుతూనే ఉంటారు. అలాగే ప్రతి సినిమా మొదలయ్యేటప్పుడు కూడా తారక్ ఈ విషయాన్ని చెప్పడం ఏ మాత్రం మరచిపోడు.


Click it and Unblock the Notifications











