Devara : దేవర రిలీజ్‌కు ముందు ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ షాక్.. ఏం జరిగిందంటే?

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ , జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ నటించిన మూవీ దేవర. ఈ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఆదివారం హైదరాబాద్ నోవాటెల్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో కార్యక్రమం కాస్త క్యాన్సిల్ అయ్యింది. తాజాగా దేవరకు సంబంధించి మరో న్యూస్ బయటికొచ్చింది . ఆ వివరాల్లోకి వెళితే..

యువసుధ ఆర్ట్స్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దేవరపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఈ మూవీ రికార్డులు కొల్లగొడుతోంది. ట్రేడ్ పండితులు చెబుతున్న దానిని బట్టి.. దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ రూ.225 కోట్లని టాక్. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.125 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని, రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్‌తో కలిసి మరో రూ.100 కోట్లతో కలిపి దేవర థియేట్రికల్ రైట్స్ మొత్తంగా రూ.225 కోట్లు పలికినట్లు చెబుతున్నారు. దీంతో రూ.225 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎన్టీఆర్ బరిలో దిగుతున్నారు.

jr ntr spotted at shamshabad airport to attend BEYOND FEST Premier Show at los angeles in USA

మరోవైపు.. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో 1 మిలియన్ కొట్టిన దేవర.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే పాన్ ఇండియా సినిమాల పరంగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డులను దేవర బద్ధలుకొట్టింది. రిలీజ్‌కు నాలుగు రోజుల సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మరిన్ని కోట్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో దేవర యూనిట్ సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేయగా.. అది కాస్తా ఫ్యాన్స్ ఓవరాక్షన్ కారణంగా మిస్ ఫైర్ అయ్యింది. నోవాటెల్ వద్దకు అభిమానులు పోటెత్తగా.. వారిని నియంత్రించలేక పోలీసులు, నోవాటెల్ సిబ్బంది చేతులెత్తేశారు. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆడిటోరియంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులపై లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా.. దేవరను ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరగనున్న జానర్ ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్ 'బియాండ్ ఫెస్ట్'లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ మెగా ఫెస్టివల్ జరగనుంది. సెప్టెంబర్ 26న ఈజిప్టియన్ థియేటర్‌లో దేవర ప్రదర్శన జరగనుండగా.. హాలీవుడ్ సెలబ్రెటీలు దేవరను వీక్షించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయల్దేరారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో తారక్ కనిపించగా.. అభిమానులు తమ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: jr ntr devara beyond fest 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X