ఎన్టీఆర్‌ను స్టార్‌గా మార్చిన మూవీ రీ రిలీజ్.. ఇది కదా అసలైన పండుగ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ మూవీల ట్రెండ్ చాలా కాలం పాటు కనిపించింది. ఈ నేపథ్యంతో వచ్చిన చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అంతేకాదు, వసూళ్లు పరంగానో, ఎక్కువ థియేటర్లలో ప్రదర్శితం అవడమో లేక ఎక్కువ రోజులు ఆడడమో ఇలా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. అలాంటి వాటిలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆది' ఒకటి. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగ రాసే ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో పాటు తారక్‌ను చిన్న వయసులోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మార్చేసిన విషయం తెలిసిందే.
వీవీ వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రమే 'ఆది'. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం బడా స్టార్ల చిత్రాలకు పోటీని ఇచ్చేలా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఈ చిత్రం రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి.. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.19.82 కోట్లు లాభాలను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్‌గా మిగిలింది. అలాగే, ఎక్కువ కేంద్రాల్లో యాభై, వంద రోజులు పూర్తి చేసుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది.

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు 4K ప్రింట్లతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల పరంగా సత్తా చాటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆది' చిత్రాన్ని మళ్లీ విడుదల చేయబోతున్నారు. అతడి పుట్టినరోజును పురస్కరించుకుని మే 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. దీనితో ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు అసలైన పండుగ రాబోతుందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











