Devara: ఎన్టీఆర్ సైలెంట్‌గా మరొకటి.. యంగ్ టైగర్ స్పీడుకు సినీ పెద్దలే షాక్
ఏమాత్రం కష్టపడకుండానే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన రీతిలో రాణిస్తూ బడా హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇక, ఈ మధ్య కాలంలో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
హై రేంజ్ యాక్షన్‌తో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'దేవర' మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన మూడు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. చివరిగా జరిగిన దానిలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అయ్యారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. కానీ, అప్పటి నుంచి ఎక్కడా బ్రేకులు లేకుండానే చిత్రీకరణ జరుపుతున్నారు. ఇలా తాజాగా ఈ సినిమా నాలుగో షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే దాదాపుగా 30 శాతం వరకూ షూట్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ స్పీడు చూసి సినీ పెద్దలే షాక్ అవుతున్నట్లు తెలిసింది. ఇక, మరో భారీ షెడ్యూల్‌ను జూలై మొదటి వారంలో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు మెయిన్ లీడ్ మొత్తం పాల్గొంటుందని టాక్.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలిసి చేస్తున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











