Devara: ముందే లీకైన దేవర గ్లింప్స్ హైలైట్స్.. ఆ మూడూ పూనకాలు తెప్పించేలా!

టాలీవుడ్‌లో ఉన్న చాలా స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు తలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. RRR చిత్రంతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న అతడు.. ఇప్పుడు తన రేంజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రమే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్టుకు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే 85 శాతం వరకూ పూర్తి చేసుకున్నారు. ఇలా దీన్ని త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు.

Recommended Video

Devara: ముందే లీకైన దేవర గ్లింప్స్.. ఎవరు ఊహించని లుక్ లో NTR | Telugu Filmibeat

Jr NTR Starrer Devara Movie Glimpse Highlights Leaked

హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'దేవర' మూవీ నుంచి ఇప్పటికి కొన్ని పోస్టర్లు మాత్రమే వచ్చాయి. అవి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం సాలిడ్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. దీన్ని జనవరి 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

'దేవర' మూవీ గ్లింప్స్‌ను జనవరి 8, సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది.. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం ఇటీవలే విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్‌ఫుల్‌ గెటప్‌తో కనిపించాడు. దీంతో సోమవారం విడుదల కాబోయే గ్లింప్స్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

Jr NTR Starrer Devara Movie Glimpse Highlights Leaked

మరికొన్ని గంటల్లోనే రాబోతున్న 'దేవర' మూవీ గ్లింప్స్ హైలైట్స్ తాజాగా బయటకు వచ్చాయి. లేటెస్ట్ ఇన్‌ఫో ప్రకారం.. ఇది 1 నిమిషం 28 సెకెన్ల నిడివితో వస్తుందట. ఇందులో ఎన్టీఆర్ లుక్, పవర్‌ఫుల్ డైలాగులు, అనిరుథ్ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్ పూనకాలు తెప్పించేలా ఉంటాయట. ముఖ్యంగా ఇందులో వచ్చే ఫైనల్ షాట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుందని టాక్.

ఇదిలా ఉండగా.. కొరటాల - ఎన్టీఆర్ కలిసి చేస్తున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X