Devara: దేవర నుంచి హై ఓల్టేజ్ సర్‌ప్రైజ్.. సముద్రంపై సింగంలా ఎన్టీఆర్

తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ బీభత్సమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో RRR చిత్రంతో గ్లోబల్ రేంజ్‌కు చేరుకున్నాడు. ఫలితంగా అతడి క్రేజ్, మార్కెట్ భారీగా పెరిగింది.

యమ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ చిత్రంగా 'దేవర'ను చేస్తున్నాడు. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని చిత్రీకరిస్తున్నారు.

Jr NTR Starrer Devara Movie Glimpse Release Date Announced

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు విడుదల అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.

Jr NTR Starrer Devara Movie Glimpse Release Date Announced

హై రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను జనవరి 8 విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్‌ఫుల్‌ గెటప్‌తో కనిపించాడు. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X