Devara: మారిన ‘దేవర గ్లింప్స్’ డేట్.. ఆరోజే పాన్ ఇండియానే షేక్ అయ్యే విధంగా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్య కాలంలో అతడు హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే RRR చిత్రంలోని నటనతో ఏకంగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
ఏకంగా ఆరు హిట్లతో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం తన 30వ చిత్రంగా 'దేవర'ను చేస్తున్నాడు. సముద్ర తీర ప్రాంత కథతో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని జరుపుతున్నారు.

'జనతా గ్యారేజ్' సక్సెస్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తోన్నారు.. ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు విడుదల అయ్యాయి. అయినా ఫ్యాన్స్ మాత్రం దీని నుంచి బిగ్ సర్‌ప్రైజ్ కోరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఇది విడుదలయ్యే తేదీ గురించి క్లారిటీ వచ్చింది.

పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను జనవరి 8 విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తాజాగా తెలిసింది. అయితే, దీన్ని అన్ని భాషలకూ సెట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారట. ఈ వీడియో చూసిన తర్వాత పాన్ ఇండియా మొత్తం షేక్ అయ్యేలా దీన్ని కట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











