Jr NTR: దేవర మూవీ హైలైట్స్ మొత్తం లీక్.. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ సీన్స్ ఎలా ఉంటాయంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో రకాల సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ, అందులో కొన్ని మూవీలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' (Devara) మూవీ ఒకటి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ సినిమాలోని హైలైట్స్ మొత్తం లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరు కూడా చూసేయండి మరి!
దేవరగా రాబోతున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమే 'దేవర'. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

దేవర మూవీ హడావిడితోనే
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సైతం తీసుకు వచ్చారు. అలాగే, కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. వీటితో పాటు చిత్ర యూనిట్‌తో కొన్ని ఇంటర్వ్యూలను కూడా నిర్వహించబోతున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఈ మూవీ హడావిడే దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది.
కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమానే 'దేవర'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతుందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. వైల్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఫ్యాన్స్‌ను అలరించే ఎన్నో అంశాలను పెట్టినట్లు ఇటీవలే దర్శకుడు బయట పెట్టేశాడు.

ట్రైలర్‌తో చాలా విషయాలే
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీ కథ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో దర్శకుడు చాలా విషయాలను బయటపెట్టేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ తండ్రి కొడుకుగా నటిస్తున్నట్లు చూపించాడు. అలాగే, ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా ఇందులో పెట్టినట్లు కొన్ని షాట్ల ద్వారా తెలిసింది.
లీక్ అయిపోయిన హైలైట్లు
ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించి తాజాగా కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో హైలైట్లు కూడా లీక్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో 4 ఫైట్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, 2 సాంగ్స్, వర (చిన్న ఎన్టీఆర్) సెకెండాఫ్ సీన్స్, సెంటిమెంట్స్ సీన్స్, సైఫ్, శ్రీకాంత్ సన్నివేశాలు అలరిస్తాయట.

40 సినిమాలు మరో లెవెల్
'దేవర' సినిమాలో ఎన్నో హైలైట్లు ముందే బయటకు వచ్చాయి. అలాగే, ఇందులో చివరి 40 నిమిషాలు వేరే లెవెల్‌లో ఉంటాయని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే చెప్పాడు. అంటే పైన చెప్పిన హైలైట్లతో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ కాబోతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం అని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











