Devara కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ.. పవన్ అభిమానులు డీలా

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వరుసగా భారీ చిత్రాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఉన్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'దేవర' మూవీ చేస్తున్నాడు.

నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు ఆకాశం అంత ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Jr NTR Starrer Devara Movie New Release Date Announced

వరుసగా హిట్లు కొడుతోన్న ఎన్టీఆర్.. కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా చిత్రీకరణను కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే పూర్తి చేసేలా ప్లాన్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని అక్టోబర్ 10 తేదీకి పోస్ట్‌పోన్ చేసేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చారు. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

'దేవర' మూవీ రిలీజ్‌ డేట్‌పై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27వ తేదీకి ప్రీపోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో అప్పుడు రావాల్సిన పవన్ కల్యాణ్ OG వాయిదా పడుతుందని కూడా కన్ఫార్మ్ అయింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు.

ఇదిలా ఉండగా.. డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X