Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్.. భయం పరిచయం చేసిన దేవర

టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే హిట్లను అందుకుంటూ ఫామ్‌లో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. 'టెంపర్' నుంచి మొదలుకొని ఏకధాటిగా విజయాలను అందుకుంటోన్న అతడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గానూ మారాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తోన్న చిత్రమే 'దేవర'. కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ సినిమా కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Jr NTR Starrer Devara Movie Special Poster Released

'జనతా గ్యారేజ్' వంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా చిత్రీకరణను చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 95 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా రెడీ అవుతున్నారు.

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇలా ఇప్పటికే గ్లింప్స్‌తో పాటు రెండు పాటలను కూడా వదిలారు. ఇవన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు మరో స్పెషల్ సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు.

Jr NTR Starrer Devara Movie Special Poster Released

'దేవర' మూవీ రిలీజ్‌‌కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లతో కనిపించాడు. అంతేకాదు, 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతుంది' అంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక, ఎన్టీఆర్ పోస్టర్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. క్రేజీ యాక్షన్‌తో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara jr ntr koratala shiva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X