రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్.. ఎప్పటికీ మరిచిపోవంటూ.. యంగ్ టైగర్ ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు రేపేనని (మార్చి 27) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఈ మేరకు మెగా అభిమానులు గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా వ్యాప్తి చెందుతుందన్న కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను సెలెబ్రేట్ చేయోద్దని, అదే తనకు ఇచ్చే కానుక అని రామ్ చరణ్ కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇంట్లోనే ఉంటూ చరణ్ బర్త్ డేను అభిమానులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్.

అదరగొట్టిన మోషన్ పోస్టర్

అదరగొట్టిన మోషన్ పోస్టర్


ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్ అంతలా విజృంభిస్తున్నా.. ఆర్ఆర్ఆర్ మాత్రం అదే స్థాయిలో హల్చల్ చేసింది. ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు.

రౌద్రం, రణం, రుధిరం..

రౌద్రం, రణం, రుధిరం..

నిప్పుతో రామ్ చరణ్‌ను, నీటితో ఎన్టీఆర్‌ను పోల్చిన జక్కన్న.. మరో అద్భుతం సృష్టించబోతోన్నట్టు కనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పంచభూతాల్లోని రెండు ప్రధానమైన శక్తుల ప్రతిరూపాలుగా చూపిస్తూ.. జరగబోయేది ఇక రణమే అన్నట్టుగా మోషన్ పోస్టర్ ఉందని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతోన్నారు.

ఎప్పటికీ మరిచిపోలేవు..

ఎప్పటికీ మరిచిపోలేవు..


రామ్ చరణ్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ టీమ్ అదిరిపోయే సర్‌ప్రైజ్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బ్రో.. రామ్ చరణ్.. మామూలుగా అయితే నీ పుట్టినరోజు వేడుకలను ఓ రేంజ్‌లో చేయాలి.. కానీ లాక్ డౌన్, కరోనా మహమ్మారి విజృంభించడంతో అది కుదురలేదు.. ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉండాలి. అందుకే నీ కోసం రేపు ఉదయం పది గంటలకు డిజిటల్ సర్‌ప్రైజ్ ఇస్తున్నా.. నన్ను నమ్ము.. అది అదిరిపోయేలా ఉంటుంది.. నువ్వెప్పటికీ మరిచిపోలేవు.. రామరాజు కోసం భీమ్' అంటూ పేర్కొన్నాడు.

సరైన సమయంలోనే వచ్చాను..

ఎన్టీఆర్ ట్వీట్‌కు రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘అవునా.. అయితే నేను సరైన సమయానికే ట్విట్టర్ ప్రపంచంలోకి వచ్చాను..లేదంటూ నీ సర్‌ప్రైజ్‌ను మిస్ అయ్యేవాడిని..రేపటి వరకు ఆగలేకపోతోన్నా.. ' అని ట్వీట్ చేశాడు. అయితే ఇది కచ్చితంగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్కేనని ఫ్యాన్స్ సంబరాలు ఇప్పటి నుంచే చేసుకోవడం మొదలు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X