విలక్షణ హీరోకు జూనియర్ ఎన్టీఆర్ సాయం: అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకున్న నటుడు సత్యదేవ్. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతిలక్ష్మీ' అనే సినిమాతో హీరోగా మారాడు. అక్కడి నుంచి తన సత్తాను నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఇప్పుడు 'తిమ్మరసు' అనే సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన చిత్రమే 'తిమ్మరసు'. న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. జూలై 26, సాయంత్రం 4.50 గంటలకు ట్రైలర్ లాంచ్ కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'తిమ్మరసు' మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఓటీటీలో విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, థియేటర్లలోనే విడుదల చేయాలని ఆగారు. ఇక, ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడంలో సూపర్ హిట్ అయిన 'బీర్బల్'కు ఇది రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











