ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్: అప్పటి నుంచే మొదలు కాబోతుంది
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే మూవీ ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా రోజులే అవుతోంది. కానీ, షూటింగ్ గురించి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో గానీ, మే మొదటి వారంలో కానీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పటి లోపు RRR షూటింగ్‌ను పూర్తి చేసేసి.. ఈ మూవీ కోసం సన్నద్ధం అవుతాడట తారక్. ఇందులో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే డిఫరెంట్ మేకోవర్ అవబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక, ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కానీ, కియారా అద్వాణీ కానీ ఇందులో లీడ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని టాక్. ఇదిలా ఉండగా.. ఈ భారీ మూవీలో సునీల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. అలాగే, 'మన్మథుడు' ఫేం అన్షు కీలక పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











