Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎవరెన్ని చెప్పినా త్రివిక్రమ్ వినేలా లేడు.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సారి కథ సెట్ చేసుకున్నాడు అంటే వీలైనంత వరకు షూటింగ్ ని చాలా స్పీడ్ గా ఫినిష్ చేస్తాడు. నటీనటుల డేట్స్ లలో కన్ఫ్యూజన్ లేకపోతే ఆయన పూరి జగన్నాథ్ కంటే వేగంగా షూటింగ్స్ ని ఫినిష్ చేస్తాడని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. ఇక చాలా కాలం తరువాత త్రివిక్రమ్ మెగా ఫోన్ కు గ్యాప్ ఎక్కువగా ఇస్తున్నాడు. చూస్తుంటే ఈ గ్యాప్ మరో రెండు మూడు నెలలు ఎక్కువయ్యేలా ఉంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియెన్స్ ఒక రేంజ్ లో ఎదురుచూస్తున్నారు గాని ఇంకా చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ RRRతో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో మరో సినిమాను అయితే స్టార్ట్ చేసేలా లేడని అనిపిస్తోంది. దీంతో త్రివిక్రమ్ మరో చిన్న సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు మొన్నటివరకు టాక్ వచ్చింది గాని అది నిజం కాదని తెలుస్తోంది.
నిర్మాత చినబాబు కూడా చిన్న హీరోతో ఏదైనా ఫ్యామిలీ కథను ప్లాన్ చేయమని చెప్పారట గాని త్రివిక్రమ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ జనవరిలో RRR షూటింగ్ కి ఎండ్ కార్డ్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ ఫిబ్రవరిలో తన సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా ఎండ్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.