Fury of NTR 30: పవర్ఫుల్ లుక్ తో ఎన్టీఆర్.. నడిసముద్రంలో భయాన్ని చూపించేలా..
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా ప్రపంచంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ప్రేక్షకులలో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మొట్టమొదటి అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఎన్టీఆర్ తన వాయిస్ తో ఆడియన్స్ కు సరికొత్త కిక్కు ఇచ్చాడు. వస్తున్నా.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే.
Recommended Video


అంతకుమించి అనేలా
జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల్లో అంచనాలు అయితే అంతకంతకూ పెరిగి పోతూనే ఉంటాయి ఇక ఇప్పుడు రాజమౌళి RRR సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టుపై అంతకు మించి అనేలా అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్.

పుట్టినరోజు సందర్భంగా..
కొరటాల శివ దర్శకత్వంలో ఇదివరకే జనతాగ్యారేజ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే దర్శకుడితో సోలోగా ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా అతి పెద్ద కాన్వాస్ ఉన్న స్టోరీగా రాబోతున్నట్లు ఇదివరకే దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు.

వస్తున్నా..
సముద్రంలో ఉరుములు మెరుపులతో ఎన్టీఆర్ ఈ టీజర్లో సరికొత్తగా వాయిస్ ఓవర్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదు అని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చింది అని.. వస్తున్నా..' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మామూలుగా లేదు. అలాగే రెండు కత్తులు పట్టుకొని సముద్రం నడి మధ్యలో నిలబడినట్లు ఉండడం కూడా అద్భుతంగా ఉంది.

ఆడియెన్స్ అనుకున్నట్లే..
ఇక అందరూ ఊహించినట్లుగా ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం. మొదట ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆడియన్స్ అయితే అనిరుద్ అయితే బాగుంటుంది అని ఎంతో బలంగా కోరుకున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా మరో ఆలోచన లేకుండా ఆడియన్స్ కు నచ్చినట్లు గానే అనిరుధ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు.
బడ్జెట్ ఎంతంటే..
ఈ సినిమాలు ఎన్టీఆర్ ఆర్ట్స్, అలాగే యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











