Jr NTR Vs Aamir Khan: సినీ లెజెండ్ బయోపిక్ అమీర్ ఖాన్‌తో ఎన్టీఆర్ పోటీ.. ఇరికించేసిన రాజమౌళి
ఒకే కథతో రెండు సినిమాలు రావడం సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఇద్దరు అగ్ర దర్శకులు, ఇద్దరు టాప్ హీరోలు కలిసి ఒకే కథతో రెండు వేర్వేరు సినిమాలు ఒకే సమయంలో చేయాలని పోటీపడటం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఈ విషయం జాతీయ మీడియాలో ట్రెండింగ్ విషయంగా మారిపోయింది. అమీర్ ఖాన్‌తో రాజ్ కుమార్ హిరాణీ, జూనియర్ ఎన్టీఆర్‌తో తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఆ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదా సాహెబ్ ఫాల్కే మహరాష్ట్రలోని త్రయంబక్‌లో జన్మించారు. 1913 సంవత్సరంలో రాజా హరిచంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారుగా 15 వేల రూపాయలతో నిర్మించారు. దాదాపు ఆయన 90 సినిమాలను రూపొందించారు. అలాగే 50 షార్ట్ ఫిలింస్ కూడా తెరకెక్కించారు. ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే. అలాంటి గొప్ప సినీ ప్రముఖుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం మొదలైంది.

దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను బాలీవుడ్ దర్శకుడు, 3 ఇడియట్స్, సంజూ లాంటి చిత్రాలను అందించిన రాజ్ కుమార్ హిరాణీ వెండి తెర మీద ఆవిష్కరించేందుకు సిద్దమయ్యారు. ఫాల్కేగా అమీర్ ఖాన్‌ను నటింపజేసేందుకు రెడీ అయ్యారు. అమీర్ ఖాన్ రూపొందించిన సితారే జమీన్ పన్ సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత ఈ సినిమను అక్టోబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది.
భారతీయ సినిమాకు పునాది రాయి లాంటి సినీ ప్రముఖుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా అమీర్ ఖాన్‌తో రాజ్ కుమార్ హిరాణీ సినిమాను తీయాలని అనుకొంటున్నారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ భారత స్వాతంత్ర్య ఉద్యమంగా ఉంటుంది. గత నాలుగు సంవత్సరాలుగా సినిమా స్క్రిప్టు మీద వర్క్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా ఫాల్కే బయోపిక్ తెరకెక్కనున్నది. ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తీకేయ, బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ గుప్తా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను ఆరు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
ఇలా మెడ్ ఇన్ ఇండియా సినిమాను రాజమౌళి నిర్మాతగా, ఫాల్కే బయోపిక్‌ను రాజ్ కుమార్ హిరాణి తీయడం విశేషంగా మారింది.ఇద్దరు కూడా ఒకే సబ్జెక్ట్‌తో ముందుకు రావడం క్రేజీగా మారింది. అయితే ఫాల్కేగా ఎన్టీఆర్, అమీర్ ఖాన్ నటించడం ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే ఒక లెజెండ్ రోల్ కోసం అమీర్, ఎన్టీఆర్ పోటీ పడి నటించడం భారతీయ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











