బాలయ్యకు తారక్ ఛాలెంజ్.. బాబాయ్ గారు ఇలాంటి పనులు చేయగలరా?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా తారలు సరికొత్త ఛాలెంజ్ లతో లాక్ డౌన్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు ఫిల్మ్ నగర్ లో ఉన్న చాలా మంది సినీ స్టార్స్ ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు రావడం మానేశారు. దీంతో స్టార్స్ ఎప్పుడు లేని విధంగా ఇళ్ళల్లో నడుము వంచి పని చేస్తున్నారు. ఇక ఇప్పుడు #BetherealMan అనే హ్యాష్ ట్యాగ్ తో స్టార్స్ ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు.

రాజమౌళి తరువాత తారక్..
జూనియర్ ఎన్టీఆర్ కూడా #BetherealMan అనే ఛాలెంజ్ ని రాజమౌళి నుంచి స్వీకరీంచాడు. గిన్నెలు క్లీన్ చేసి, ఇల్లు తుడుస్తూ.. గార్డెన్ లో చిపిరి పట్టి పని చేసిన జూనియర్ ఎన్టీఆర్ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే అద్భుతమైన కొటేషన్ ఇచ్చాడు. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు పనులను కూడా పంచుకుందాం అంటూ.. వర్క్ షేర్ చేసుకుంటే చాలా సరదాగా ఉంటుందని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.
Recommended Video

బాలకృష్ణకు ఛాలెంజ్..
ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేస్తూ ఇతర స్టార్ హీరోలను కూడా ఈ ఛాలెంజ్ లో నామినేట్ చేశారు. మొదట బాల బాబాయ్ కోసమేనని తారక్ పేర్కొన్నాడు. అయితే ఈ పని బాలయ్య చేయగలడా? అని అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ బాబాయ్ గురించి ఎంత ప్రస్తావించినా ఇంతవరకు బాలక్రిష్ణ తారక్ గురించి పెద్దగా స్పందించింది లేదు. మరి ఈ సారి బాలయ్య ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ గురించి ఏమైనా ఆలోచిస్తాడేమో చూడాలి.

మిగతా హీరోలకు కూడా..
ఎన్టీఆర్ మిగతా స్టార్ హీరోలను కూడా ఈ ఛాలెంజ్ లో నామినేట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున బాబాయ్, వెంకటేష్ గారు, అలాగే డైరెక్టర్ కొరటాల శివ గారి కోసం ఈ ఛాలెంజ్.. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇకపోతే ఇప్పటికే మెగాస్టార్ ఇంటి పనులు చేయడం స్టార్ట్ చేశారు. మరి మిగతా వారు ఎలా దర్శనమిస్తారో చూడాలి.

RRR వాయిదా?
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. జనవరిలో సంక్రాంతికి కానుకగా సినిమా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది. లాక్ డౌన్ తరువాత సమయం దొరికితే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రోజు చర్చలు జరుపుతున్నారట.


Click it and Unblock the Notifications











