అదిరిపోయే ప్లాన్.. ఉప్పెన ట్రైలర్‌పై ఎన్టీఆర్ వీడియో వైరల్
ఓ సినిమాపై అంచనాలు పెంచేడయం, అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేలా చేయడం మామూలు విషయం కాదు. ముందుగా సినిమాను అందరి నోళ్లలో నానాలంటే ఆడియో అందరికీ నచ్చాలి. పాటలు అందరికీ నచ్చాయంటే.. అన్ని పాటలు హిట్టయ్యాయంటే సినిమా హిట్టైనట్టే. ఆడియో సక్సెస్ అయితే సినిమా తొంబైశాతం గట్టెక్కినట్టే. అలా ఉప్పెన సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
అలాంటి తరుణంలో ఉప్పెన అదిరిపోయే ప్లాన్ వేసింది. ఇందులోనూ వారు తమ క్రియేటివిటీని చూపించారు. ఉప్పెన నుంచి ఇప్పటికే వదిలిన ప్రతీ సాంగ్ ప్రతీ తెలుగోడిని ఉప్పెనలా తాకింది. చివరగా వచ్చిన జల జల జలపాతం అనే మెలొడి ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అలాంటి తరుణంలో తాజాగా ఉప్పెన టీం మరో అప్డేట్‌ను ప్రకటించింది. అందులోనూ ఎన్టీయార్ సినిమాలోని ఓ డైలాగ్‌తో వీడియోను ఎడిట్ చేశారు.

ఉప్పెన ఫిబ్రవరి 12న రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ పెంచే పనిలో భాగంగా ట్రైలర్‌ను ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత ట్రైలర్ రిలీజ్ చేయిస్తామని ఇది వరకే ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను వదిలారు. జనతా గ్యారెజ్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్‌తో ఉప్పెన ట్రైలర్‌పై హైప్స్ పెంచేశారు. జస్ట్ శాంపిల్ చూపిస్తా.. మీకు ప్రామీస్ వేసి చెబుతున్నా జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా అని ట్రైలర్ మీద అంచనాలు పెంచేశారు.


Click it and Unblock the Notifications











