జూ.ఎన్టీఆర్ వాచ్ ధర.. ఒక కంపెనీ పెట్టొచ్చు.. ఎన్ని కోట్లో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. కాగా తరుచుగా మీడియా కంట పడుతున్నారు. ఎన్టీఆర్ చివరిగా 'ఆర్ఆర్ఆర్', 'దేవర' చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ గానూ గుర్తింపును పొందారు. చివరిగా వచ్చిన రెండు ప్రాజెక్ట్స్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తారక్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా డిమాండ్ పెరిగిపోవడం విశేషం. మరోవైపు తారక్ కూడా ఆయన అభిమానులతో పాటు ఆడియెన్స్ ను ఫిదా చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమాలపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్న తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి వేదికలైనా చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. ఆయన డ్రెసింగ్ కూడా సింపుల్ అండ్ గ్రేట్ లుక్ లో ఉండటం ఆసక్తికరంగా మారుతుంటుంది. కానీ సందర్భానుసారంగా మెదలడం తారక్ కు వెన్నెతో పెట్టిన విద్య అనే చెప్పాలి. 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఎన్టీఆర్ గ్లోబల్ గా ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేశారో తెలిసిందే. టాలీవుడ్ లో తెలుగులో మాట్లాడే తారక్, బాలీవుడ్లో హిందీ, జపాన్ లో జపాన్ భాష, ఇక అమెరికన్ యాక్సెంట్ లోనూ ఇరగదీసిన సంగతి తెలిసిందే. మరోవైపు అచ్చమైన తెలుగు భాషలోనూ అనర్గళంగా మాట్లాడగలుతాడు. ఇలా సందర్భానుసారంగా తన నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటాడు.

Jr NTR Wrist Watch

కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ 'వార్2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం యాక్షన్ ఫిల్మ్ 'వార్' కు సీక్వెల్ కావడం విశేషం. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా హృతిక్ రోషన్ తోపాటు ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మార్కెట్ లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రీసెంట్ షెడ్యూల్ లో తారక్ జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా తన స్టైలిష్ లుక్ బాలీవుడ్ మీడియాను ఆశ్చర్యపరిచింది. తారక్ సింపుల్ గానే కనిపిస్తున్నా ఆయన ధరించిన వాచ్ తో హాట్ టాపిక్ గ్గా మారాడు.

మాములుగా సెలబ్రెటీలు ఖరీదైన కార్లు, దుస్తులు, వాచ్ లు, బంగ్లాలు కలిగి ఉంటారనేది తెలిసిందే. కానీ తారక్ తాజాగా ధరించిన వాచ్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. తారక్ రీసెంట్ గా రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన ఆర్ఎం 40-01 టూర్‌బిల్లాన్ మెక్‌లారెన్ స్పీడ్‌టైల్ వాచ్‌ను ధరించారు. వార్ 2 షూటింగ్ కోసం ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆ వాచ్ కారణంగా హాట్ టాపిక్ గ్గా మారారు. దాని ధర అక్షరాల రూ.7.47 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఆ డబ్బులే ఉంటే మిడిల్ క్లాస్ వాళ్లు 5కు పైగా కంపెనీలు పెట్టుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక సందర్భానుసారంగా తారక్ మెదలడంపైనా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వాచ్ లపైనా ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి ఉంటుందని దీంతో అర్థమైపోయింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ ఎక్కువగా ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేస్తుంటారు. తనకు ఇష్టమైన వారికి కూడా కాస్ట్లీ వాచ్ లనే గిఫ్ట్ లుగా అందిస్తుంటారు. నెక్ట్స్ తారక్ 'ఎన్టీఆర్31', 'వార్2' చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత 'దేవర2'లో నటించబోతున్నారు.

More from Filmibeat

Read more about: ntr31 dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X