ఆ హాలీవుడ్ మూవీని మించి దేవర.. కల్యాణ్ రామ్ సంచలన వాఖ్యలు
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషించిన దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్లకు ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో తారక్ అభిమానులు గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్లకు పోటెత్తారు. టీజర్, ట్రైలర్ పోస్టర్ల ద్వారా సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలపై మేకర్స్ లీకులు ఇచ్చారు. వాటిని తెర మీద చూడాలని ఎన్టీఆర్ అభిమానులు ఎగబడ్డారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎక్కడో చూసినట్లుగా అనిపించిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. వీటికి చిత్ర నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే :
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ , నందమూరి కళ్యాణ్ రామ్‌లు దేవర సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా దుమ్మురేపింది. అమెరికాలో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే టికెట్ల అమ్మకాలలో ప్రభాస్ గత చిత్రాల రికార్డులను దేవర తిరగరాసింది. ఇదే స్పీడులో 3 మిలియన్ డాలర్లను నార్త్ అమెరికాలో కొల్లగొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దేవరకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండ్రోజుల్లో రూ.45 కోట్ల షేర్ వసూలు చేయొచ్చని అంటున్నారు. వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.60 కోట్ల షేర్, రూ.120 కట్ల గ్రాస్ రాబట్టవచ్చని తారక్ అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు టికెట్లు వేగంగా బుక్ అవుతుండటంతో దేవర ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్లలో దేవర విడుదల చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. దాదాపు 3 గంటల నిడివి ఉన్న దేవరను ట్రిమ్ చేసే నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. తెలుగులో కాస్త లెంగ్త్‌ను తగ్గించడే కాకుండా ఏకంగా ఓ పాటను లేపేశారు. హిందీలోనూ చాలా భాగాన్ని కత్తిరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని వల్ల హిందీ బెల్ట్‌లో దేవరకు మంచి రిజల్ట్ రావొచ్చని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఏయే సీన్స్ లేపేశారన్న దానిపై నెటిజన్లే క్లారిటీ ఇవ్వనున్నారు.
అయితే దేవరలోని కొన్ని సీన్లను కాపీ కొట్టినట్లుగా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. ఏకంగా తమిళ దర్శక దిగ్గజం శంకర్ సినిమా పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ కొడవలి పట్టుకుని ముసుగు వేసుకుని కనిపించే షాట్‌ని ఓ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో దేవరని పోల్చి చూస్తున్నారు ఆడియన్స్. ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టారు నిర్మాత కళ్యాణ్ రామ్.
ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్‌లో కత్తులన్నీ ఓ చోట పోగేసి కుర్చీలా చేయడాన్ని హాలీవుడ్ మూవీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి కాపీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. కానీ దేవర ఆ సినిమాకు మించి ఉంటుందని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. తమ్ముడు పడ్డ కష్టం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











