Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jr. NTR కొత్త లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్.. రేటు, స్పెషాలిటీలు తెలుసా?
ఆటోమొబైల్ దిగ్గజం లంబోర్ఘిని ఇండియా ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ వెర్షన్ SUV ని దేశంలో విడుదల చేసింది, దీంతో ఉరుస్ లైనప్‌కు మరో ఆప్షన్ జోడించింది. దేశంలోని మొట్ట మొదటి ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను తన కస్టమర్‌కు ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరో కాదు మన టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్. లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ కారును యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. కొన్ని నెలల క్రితం ఆయన బుక్ చేయగా అది ఇప్పటికి డెలివరీ అయింది. ఇక దేశంలో ఈ మోడల్ కారును సొంతం చేసుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ కారు ఫీచర్స్ లోకి వెళితే

దిమ్మతిరిగే ధర
ఈ లంబోర్ఘిని ఉరుస్ ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్) అయితే, క్యాప్సూల్ ఎడిషన్‌లు అదనంగా 20 శాతం ప్రీమియంను ఆకర్షిస్తాయని అంచనా. లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును దేశంలో మొట్టమొదటి సరిగా బెంగళూరులో ఆగస్టు 18న లాంచ్ చేశారు. ఇక ఎన్టీఆర్ బుక్ చేసిన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తెప్పించారు.

ఆ బైక్ విషయంలో కూడా
గతంలో ఎన్టీఆర్ హార్లీ డేవిడ్సన్ కంపెనీకి చెందిన నైట్ రైడర్ బైక్‌ను కూడా దేశంలో కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా ఘనతను సాధించగా దానిని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే స్థాయిలో ఈ కారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్ళారు. అయితే షూటింగ్ ముగించుకొని ఉక్రేయిన్ నుంచి ఇటీవలే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.

4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్
ఉక్రెయిన్ నుంచి రాగానే లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు నేరో నోక్టిస్ మ్యాటే విత్ ఆరాన్సియో ఆర్గోస్ కలర్‌తో కోటింగ్ చేయబడింది. లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ కారు 4.0 లిటర్ ట్విన్ టర్బో చార్జ్‌డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో 650hp, 850Nm డెవలప్ చేయబడిందని అంటున్నారు.

305 కిలోమీటర్ల వేగంతో
అంతే కాక ఈ లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ కారు 8 స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. అంతే కాక లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు అంటే ఈ 2.2 టన్నుల సూపర్ ఎస్‌యూవీ 305 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ఒక గంటలోపే వెళ్ళచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.

మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్‌పై
గ్రాఫైట్ క్యాప్సూల్ 23 ఇంచెస్ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. లంబోర్ఘిని ఉరుస్ వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ యూనిట్లతో వస్తుంది. మధ్యలో లంబోర్ఘిని లోగో ఉంది. లంబోర్ఘిని ఉరుస్‌లో ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ ఓపెన్ చేయగానే మీకు 616 లీటర్ల సామర్థ్యంతో ఉన్న పెద్ద బూట్ స్పేస్ లభిస్తుంది. ఇది ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక లంబోర్ఘిని ఉరుస్ ఇంటీరియర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.