Movie Releases in June: బాక్సాఫీస్‌ను ముంచెత్తనున్న భారీ సునామీ.. జూన్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే!

చూస్తుండగానే సమ్మర్ వెళ్లిపోయింది. సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన వేసవి సీజన్ వృథా అయిపోయింది. పెద్ద సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోయాయి. చిన్న చిత్రాలు తాయ్ కెళవి, వాజా 2, యూత్, భరత నాట్యం 2 వంటి సినిమాలు మంచి వసూళ్లను రాబట్టగా.. సమ్మర్ చివరిలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన దృశ్యం 3, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు సినిమాలు భారీ వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు ఊపిరి పోశాయి. అయితే జూన్ నెల మాత్రం అభిమానులు, ప్రేక్షకుల ఆకలి తీర్చేందుకు రెడీ అయ్యింది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను ముంచెత్తడానికి రెడీ అయ్యాయి. మరి జూన్ నెలలో ఏయే సినిమాలు.. ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో పరిశీలిస్తే..

June 2026 Movie Releases Peddi Jana Nayagan Maa Inti Bangaram and More Big Films Set for Grand Release

పెద్ది
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. స్పోర్ట్స్, బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. జూన్ 4న పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

పరిమళ అండ్ కో
సీనియర నటుడు జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ పరిమళ అండ్ కో. పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. ఫ్యామిలీ, క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను నిర్మించారు. యోగిబాబు ప్రధాన పాత్రలో అలరించనున్నారు. జూన్ 5న పరిమళ అండ్ కో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాలీవుడ్ టైమ్స్
మలయాళ హిట్ మూవీ ప్రేమలు ఫేమ్ నస్లేన్ కే గఫూర్ హీరోగా నటిస్తోన్న మూవీ మాలీవుడ్ టైమ్స్. అభినవ్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది.

మ్యాంగో పచ్చ
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కుటుంబం నుంచి ఆయన మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అదే మ్యాంగో పచ్చ. 15 ఏళ్ల క్రితం కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన పొలిటికల్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. వరల్డ్ వైడ్‌గా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది మ్యాంగో పచ్చ

సింగ్ గీతం
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మూవీ సింగ్ గీతం. కల్కి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. అహిల్య బమ్రూ, ఆయాన్ కే కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 11న సింగ్ గీతం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

మా ఇంటి బంగారం
టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత చాలా కాలం తర్వాత స్ట్రైయిట్ తెలుగు మూవీలో నటించిన చిత్రం మా ఇంటి బంగారం. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఆమె భర్త రాజ్ నిడిమోరు నిర్మించగా.. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. స్టార్ యాంకర్ శ్రీముఖి, గౌతమి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 19న మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు మరో నాలుగు చిత్రాలు ఇదే రోజున విడుదల కానున్నాయి. బాలన్ ది బాయ్, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, చెట్టు మీద దెయ్యం నాకేం భయం సినిమాలు రిలీజ్ కానున్నాయి.

జన నాయగన్
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. విజయ్ సీఎం కావడంతో జననాయగన్‌కు అడ్డంకులు తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. జూన్ 19న జన నాయగన్ రిలీజ్ అవుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.

లెనిన్
వరుస పరాజయాలతో ఉన్న అక్కినేని నాగార్జున వారసుడు.. అఖిల్ అక్కినేని ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అదే లెనిన్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 26న లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X