Balayyaతో పోటీ పడుతున్న Jr.NTR... ఏకంగా భగవంత్ కేసరి సినిమాకి పోటీగా ఆ మూవీ రిలీజ్

నందమూరి నటసింహం బాలకృష్ణ థియేటర్లలో గర్జించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆయన నటించిన తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్లోకి వస్తోంది. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ఫ్యాన్స్ తప్పదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ బాలయ్య బాబుకు పోటీగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కావడం ఏంటో వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్... అంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వార్ జరగుతున్న విషయం తెలిసిందే. మొన్న చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంపై బాలయ్య బాబు.. ఐ డోంట్ కేర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మళ్లీ వీళ్ల మధ్య వార్ మొదలైందని అంతా అనుకున్నారు. ఇక వీరు ఎలా ఉన్నా.. వీరి ఫ్యాన్స్ మధ్య మాత్రం సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతునే ఉంటుంది.

Junior NTR Adurs Re-Release to compete with Balayya Bhagavanth Kesari on Oct 19th News Goes Viral

ఆ విషయం పక్కన పెడితే... ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ జరగనుంది. అది కూడా బాక్సాఫీస్ వద్ద. అదేంటి ఇప్పుడు రిలీజ్ కు ఉన్నది బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమానే.. కదా అనుకుంటున్నారు.. బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు పోటీగా ఎన్టీఆర్ తన సినిమాను బరిలోకి దింపుతున్నారు. అది దేవర అనుకుంటే పొరపాటే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

ఇక అదుర్స్ సినిమా భగవంత్ కేసరి సినిమాకు పోటీగా రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే భగవంత్ కేసరి. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈరోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కూడా జరుపుకోనుంది.

Junior NTR Adurs Re-Release to compete with Balayya Bhagavanth Kesari on Oct 19th News Goes Viral

ఇక భగవంత్ కేసరి సినిమాకు పోటీగా అదుర్స్ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అలా జరిగితే ఫ్యాన్స్ వార్ తప్పదని నెటిజన్స్ అంటున్నారు. అదుర్స్ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నయనతార, శీల హీరోయిన్లుగా తెరకెక్కింది. ఇక ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ.. పంచ్ లు ఈ సినిమాకు బాగా హైలెట్ గా నిలిచాయి. చారీ భట్టు అంటూ ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది.

Junior NTR Adurs Re-Release to compete with Balayya Bhagavanth Kesari on Oct 19th News Goes Viral

ఇక ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు పోటీగా థియేటర్లలో రీ రిలీజ్ కానుందట. బాలయ్య భగవంత్ కేసిరి సినిమాలో హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాట్రైలర్ రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేందు.. బాలయ్య బరిలోకి దిగుతున్నాడు. ఇక మరోవైపు ఎన్టీఆర్ కూడా దిగితే.. మ్యూచువల్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X