వార్ 2 సంచలనం.. వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చివరిగా 'ఆర్ఆర్ఆర్', దేవర చిత్రాలతో అలరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు. దాంతో తర్వాత వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2తో రాబోతున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా సరికొత్త రికార్డ్ ను సెట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో వార్ 2..
హిందీ భాషలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం వార్ 2. మల్టీస్టారర్ గా ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ చోప్రా బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2019లో వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రూ.400 కోట్లతో సినిమాను నిర్మిస్తుండటం విశేషం. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అషుతోష్ రానా, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా.. సంచిత్ బల్హరా, అంకిత్ బల్హరా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తుండటం విశేషం.

రికార్డు ధరకు వార్ 2 తెలుగు రైట్స్..
వార్ 2 చిత్రం తెలుగు స్టేట్స్ లో రికార్డును సృష్టించింది. ఇండియాలోనే టాప్ హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ చిత్రంలో నటించడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ ఏరియా వైజ్, లాంగ్వేజ్ వైజ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోతున్నాయి. ఇక వార్ 2 తెలుగు రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చించింది. తెలుగు స్టేట్స్ లో 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాలని టార్గెట్ గా పెట్టుకోవడం విశేషం.
జూ.ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్..
నార్మల్ గానే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఓపెనింగ్ డే ప్రేక్షకుల ధాటి ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు కూడా ఇండియా వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. ఈ క్రమంలో సినిమాను వరల్డ్ వైడ్ గా 9000 థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. గతంలో రజనీకాంత్ రోబో 2.0 చిత్రం 7500 థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఆ రికార్డ్ ను జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేయడం విశేషం. దీంతో వార్ 2 అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రంగానూ సరికొత్త రికార్డును సెట్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రాలు..
ఈ ఏడాది 2025 ఆగస్టు 14న వార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో 40 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్ గానే త్రివిక్రమ్ మైథాలాజికల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేవర 2 కూడా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











