Devara Glimpse: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. రెడీ అయిన దేవర గ్లింప్స్.. రాబోయేది ఆరోజే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందిరనీ ఆకట్టుకుంటూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మరే సినిమా చేయలేదు. ముఖ్యంగా 2023లో ఈయనది ఒక్క సినిమా కూడా విడుదల కూడా కాలేదు. అయితే తాజాగా ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కు 30వది కావడంతో NTR30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేందుకు మూవీ టీం కూడా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమర్షియల్ తరహాలో ఉంటూనే సామాజిక సమస్యలను ప్రశ్నించేలా కథ ఉంటుందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారానే అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు.

అలాగే ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షఐన్ టామ్ చాకో, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, చైత్ర రాయ్ లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. యువసుఘ ఆర్ట్స్ మరియ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, ఎ.శ్రీకర్ ప్రసా ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌ని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అదే విషయాన్ని ఎక్స్ వేధికగా వెల్లడించారు. దేవర సినిమా గ్లింప్స్ ను మరో రెండు రోజుల్లో అంటే జనవరి 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నారట. సాంచ్రం 4 గంటల 5 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారట. చిత్ర బృందం ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందా అని వేచి చూసే వాళ్లకు ఆకలి తీర్చినట్లు అవుతోంది.

భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రెండు పార్ట్ లలో రాబోతుంది. అయితే మొదటి పార్ట్ ను ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల అయ్యాకే పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తారా లేక ముందుగానే స్టార్ట్ చేస్తారా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











