Devara Release Date: దేవర అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏప్రిల్‌లో కాదు.. మరెప్పుడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఆయన తన నటనతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తాడు. అయితే RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో సందడి చేయనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ అండ్ డైనమిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమాలో... అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

అద్భుతమైన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే గ్లింప్స్ విడుదుల కాగా.. పెద్ద ఎత్తునే రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరినీ తెగ అలరించిన ఈ గ్లింప్స్.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ తేదీలో వచ్చే ఛాన్స్ లేదని గత కొంత కాలం క్రితమే అర్థం అయిపోయింది.
చాలా మంది ఇప్పట్లో ఈ సినిమా రాదని.. కచ్చితంగా వాయిదా పడుతుందని అన్నారు. మరికొందరు మాత్రం కచ్చితంగా ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం వస్తుందని చెబుతూ తెగ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు అన్నీ అడియాశలు అయ్యా.ి ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన కాకుండా మరో ఎనిమిది నెలల తర్వాత విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ముఖ్యంగా అక్టోబర్ 10వ గురువారం రోజు ఈ చిత్రాని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది.

అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా వస్తుందని.. అధికారిక ప్రకటన వచ్చిందో లేదో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే భారీ అంచనాలు నమోదు అయిన ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ట కొడుతుంది... ఎంతమేర కలెక్షన్లు వసూలు చేస్తుందో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











