Junior NTR: ఒక్కో ఇటుకను పేర్చి కట్టిన అభిమానం అది.. డై హార్డ్ ఫ్యాన్స్ అంటార్రా బాబూ!

ప్రజలంతా తమకు నచ్చిన వారి మీద ప్రేమను ఒక్కో రకంగా చూపిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలను ప్రేమించే వాళ్లు పువ్వులు, లేఖలు ఇస్తూ ప్రేమను వ్యక్త పరిస్తే... తమ అభిమాన నాయుకులో, నటులపై మరోలా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి పుట్టిన రోజులు, పెళ్లిళ్ల, వారి కుటుంబ సభ్యులు స్పెషల్ తేదీలను కూడా గుర్తు పెట్టుకొని సెలబ్రేట్ చేస్తారు. రక్తదానాలు, అన్నాదానాలు.. ఇలా చాలానే చేస్తారు.

ఇక నేరుగా వారే కనిపించే పరిస్థితి వస్తే మాత్రం కచ్చితంగా ఏదో ఒక బహుమానం తీసుకెళ్తారు. ఇలా తమ అభిమాన నాయుకులు లేదా హీరోలపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అభిమానం చూపిస్తూ అందరి ముందు హైలెట్ అవుతారు. అయితే తాజాగా ఓ వ్యక్తి అదిరిపోయే స్టైల్ లో తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. అతను ఎవరు, ఎవరిపై ప్రేమను ఎలా వ్యక్తం చేశాడో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Junior NTR Fan Express His Love on Different Way With Using NTR Name on Mud Bricks to Use Build His House

నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే తారక్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు విన్నా, సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఫ్యాన్స్ అంతా రచ్చ రచ్చ చేస్తుంటారు. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగ్ లు, ఫైట్ లు చూసి పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఏపీలో ఈయనకు చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా రాయలసీమకు చెందిన జూయనిర్ ఎన్టీఆర్ అభిమాని.. తారక్ పై ఉన్న ప్రేమను అందరికంటే భిన్నంగా వ్యక్తం చేశాడు. తాను కట్టుకోబోయే ఇంటికి వాడే ఇటుకలపై తన అభిమాన హీరో ఎన్టీఆర్ పేరు రాయించుకున్నాడు. ఇల్లు కోసం వాడే ప్రతీ ఇటుకపై ఆయన పేరు ఉండేలా చూసుకున్నాడు. తన గుండెల్లో ఉన్న హీరో పేరును ఇల్లు కట్టే ఇటుకలపై రాయించుకొని ఒక్క రోజులోనే సెలబ్రిటీ అయిపోయాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఓ నెటిజెన్.. పోస్ట్ చేయగా క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది. పెద్ద ఎత్తున నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిరా అభిమానం అంటే అని చెప్పుకొస్తున్నారు. మరికొందరేమే.. ఇటుకు ఇటుకలోనూ అభిమానం అంటూ రాసుకొస్తున్నారు.

Junior NTR Fan Express His Love on Different Way With Using NTR Name on Mud Bricks to Use Build His House

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేరంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X