నాగబాబు క్షమాపణలు.. దారుణంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్!
ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో వరుణ్ బాబు పర్సనాలిటీ చూస్తే ఆర్మీ జవాన్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉంటుంది. భగవంతుడిని నేను నమ్మను కానీ.. భగవంతుడి దయవల్ల అద్బుతమైన పర్సనాలిటీ అతడికి వచ్చింది. కొన్ని క్యారెక్టర్లు ఓ నటుడు చేసినప్పుడు అతడి అప్పీరియెన్స్ వల్ల అది ఎలివేట్ అవుతుంది. కొంత మంది 5.3 ఫీట్ల హైట్ ఉండి.. పోలీస్ క్యారెక్టర్ రోల్ వేస్తే అది నచ్చదు. కానీ వరుణ్ తేజ్ హైట్, పర్సనాలిటీ వల్ల అలాంటి పాత్రలు వేసినప్పుడు చక్కగా ఉందనిపిస్తుంది. అంతా ఆయన తల్లి ఆశీర్వాదం వల్ల జరిగి ఉంటుంది అని నాగబాబు అన్నారు.
అయితే ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక నటుడు, సినీ పరిశ్రమకు చెందినవాడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడు అంటూ రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి.

దాంతో తన వ్యాఖ్యల్లో ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఎవరిని టార్గెట్ చేసి చేయలేదు. ఎవరైనా నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే వారికి నా క్షమాపణలు అని నాగబాబు సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు మీడియాలోను, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నాగబాబు తన ప్రకటనలో తన క్షమాపణల ప్రకటన విడుదల చేస్తూ.. ఇటీవల జరిగిన వరుణ్ బాబు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే నొప్పదని మాట్లాడాను. ఆ మాటలను నేను వెనక్కి తీసుకొంటున్నాను అని నాగబాబు తన ప్రకటనలో తెలిపారు.
ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నా వ్యాఖ్యల వల్ల నొచ్చుకొంటే.. వారికి నేను క్షమాపణ చెబుతున్నాను. ఆ వ్యాఖ్యలు నా నోటి నుంచి యాదృచ్చికంగా వచ్చాయే కానీ.. ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకొని క్షమిస్తారని అశిస్తున్నాను అంటూ నాగబాబు తన ప్రకటనలో తెలిపారు.
అయితే నాగబాబు వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. నోటి దూల తీరింది.. నువ్వే కావాలని అన్నావు.. నిన్ను మాత్రం వదలం.. జగన్‌ను ఉద్దేశించి ఆ కామెంట్ చేశావు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











