SIIMA 2023 చంద్రబాబు అరెస్ట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్‌కి.. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (SIIMA) అవార్డులు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. 2023 సంవత్సరానికి దక్షిణాదిలో రాణించిన, ఉత్తమ ప్రదర్శన చూపించిన నటీనటులు బెస్ట్ అవార్డులు అందుకోవడానికి సిద్దమయ్యారు. ఈ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. సైమాకు సంబంధించిన అప్ డేట్స్, ప్రత్యేకతల వివరాల్లోకి వెళితే..
సైమా 2023 అవార్డులు దుబాయ్‌లో భారత కాలమానం ప్రకారం 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం రాత్రి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డులు వేడుక జరుగనున్నాయి. ఈ వేడుకలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు పాల్గొననున్నారు.

సైమా 2023 వేడుకల్లో ఉత్తమ నటుడు అవార్డు కేటగిరిలో అడివి శేషు, దుల్కర్ సల్మాన్, ఎన్టీఆర్, నిఖిల్ సిద్దార్థ, రాంచరణ్, సిద్దూ జొన్నలగడ్డ పోటీ పడుతున్నారు.అడివి శేషు మేజర్ మూవీకి, దుల్కర్ సీతారామం, ఎన్టీఆర్ RRR, నిఖిల్ సిద్దార్థ కార్తీకేయ 2 సినిమా కోసం, RRR కోసం రాంచరణ్, డీజే టిల్లు సినిమా కోసం సిద్దూ రేసులో ఉన్నారు.
సైమా 2023 వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల క్రితం పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో జనతా గ్యారేజ్ సినిమా కోసం ఉత్తమ నటుడి అవార్డును అందుకొన్నారు. ఈ సారి RRR సినిమా కోసం ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకోనున్నట్టు తెలుస్తున్నది. అందుకోసమే ఎన్టీఆర్ దుబాయ్‌కి తన కుటుంబంతో కలిసి వెళ్తారు.

అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్ కనీసం ప్రకటన చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించకపోవడంపై టీడీపీలోను, ఆయన అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, నందమూరి ఫ్యామిలీలో ఒకరమైన పరిస్థితి ఉంటే పట్టించుకోకుంబడా దుబాయ్‌కి వెళ్లారనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











