Devara Glimpse: చేపల కంటే కత్తులనే.. అందుకే ఎర్ర సముద్రం.. దేవర గ్లింప్స్ ఎలా ఉందంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఆయన తన నటనతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నుంచి ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. RRR సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న ఎన్టీఆర్ తాజాగా మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ చిత్రమే దేవర.
అయితే ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
Recommended Video

అద్భుతమైన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు విడుదల అయ్యాయి. అవి చూసిన అభిమానులు తెగ ఆతృతగా సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్లు వస్తాయా, ఎన్టీఆర్ ఎంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారో అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లకోసమే ఈ చిత్రం బృందం తాజాగా గ్లింప్స్ ను విడుదల చేసింది.

తాజాగా విడుదల అయిన గ్లింప్స్ రన్ టైం 1.19 నిమిషాలు ఉండగా.. ముందుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వీడియో స్టార్ట్ అయింది. అనిరుథ్ అందించిన మ్యూజిక్ ఈ గ్లింప్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సముద్రంలో పడవల్లో వెళ్తున్నట్లు చూపించి కొన్ని కంటైనర్ లను దొంగిలించినట్లు చూపించారు. ఈక్రమంలోనే యంగ్ టైగర్ లుంగీ కట్టుకుని చేత కత్తి పట్టుకుని వచ్చి చేసిన ఫైట్ అయితే మరింత అదిరిపోయింది. వినల్లను పొడిచి వచ్చి అదే కత్తిని సముద్రపు నీటిలో కడగడం.. ఆ నీరంతా ఎర్రగా మారిపోవడం మరింత హైలెట్ గా నిలిచింది.

ఇక చివర్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అయితే అదిరిపోయింది. ఈ సముద్రం చాపల కంటే కత్తుల్ని, నెత్తురనే ఎక్కువ చూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అని అంటారు అంటూ డైలాగ్ చెబుతుండగా.. హీరో బ్యాక్ సైడ్ వ్యూ చూపించారు. సముద్రం వైపు తిరిగ ఎట్టీఆర్ కూర్చోగా.. అలలు ఉరకలెత్తుతూ కనిపిస్తాయి. ఇక చివరగా ఎన్టీఆర్ ను చూపించగా.. ఆయన అదిరిపోయే లుక్ లో కనిపించారు. మీరూ ఓసారి ఈ అద్భుతమైన గ్లింప్స్ ను చూసేయండి.


Click it and Unblock the Notifications











