Junior NTRతో మంత్రి అజయ్ పువ్వాడ భేటి.. కొరటాల శివ కూడా.. కారణం ఏమిటంటే..

తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం (జూలై 5వ తేదీన) సినీ ప్రముఖులను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన కుమారుడు డాక్టర్ నయన్ పువ్వాడ జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి అజయ్ టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి చేత తన కుమారుడికి ఆశీస్సులు అందించారు.

చిరంజీవితో భేటీ తర్వాత

చిరంజీవితో భేటీ తర్వాత

తొలుత మెగాస్టార్ చిరంజీవిని మంత్రి అజయ్ కుమార్, ఆయన కుమారుడు నయన్ పువ్వాడతో కలిశారు. అనంతరం చిరంజీవి ఆశీస్సులు అందుకొన్నారు. ఆ క్రమంలో చిరంజీవి స్వయంగా తెప్పించిన కేక్‌ను డాక్టర్ నయన్ కట్ చేశారు. అయితే చిరంజీవి, మంత్రి అజయ్ కుమార్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే కలిసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్‌తో మర్యాదపూర్వకంగా

జూనియర్ ఎన్టీఆర్‌తో మర్యాదపూర్వకంగా

ఆ తర్వాత మంత్రి అజయ్, నయన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి అజయ్ కుటుంబాన్ని ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ సందర్బంగా ఎన్టీఆర్‌ను శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చాన్ని ఇచ్చి తన అభిమానాన్ని చాటుకొన్నారు.

ఎన్టీఆర్ కుటుంబానికి, తన తండ్రి హరికృష్ణకు అజయ్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావుతో అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకొన్నట్టు తెలిసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రముఖులు ఇలా కలుసుకోవడం అభిమానులకు ఆనందాన్ని పంచింది.

దర్శకుడు కొరటాల శివతో కలిసి

దర్శకుడు కొరటాల శివతో కలిసి

ఎన్టీఆర్‌తో భేటి సందర్భంగా అజయ్‌తో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. గతంలో అజయ్, కొరటాల శివ కుటుంబాలకు వామపక్ష నేపథ్యం, బంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో సుదీర్ఘమైన భేటీ మంత్రి అజయ్‌తో జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సినీ, రాజకీయ విషయాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది.

Recommended Video

Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
ఎన్టీఆర్ కెరీర్ గురించి

ఎన్టీఆర్ కెరీర్ గురించి

ఇక ఎన్టీఆర్ సినిమాల గురించి వస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో RRR చిత్రం చేస్తున్నారు. RRR చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివతో కలిసి ఓ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X