విజయ నిర్మలకు జూనియర్ ఎన్టీఆర్ శ్రద్దాంజలి.. మార్గదర్శకురాలు.. ఎందరికో స్ఫూర్తి..
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ తన సంతాపాన్ని తెలియజేశారు.
విజయ నిర్మల గారు సినీ దర్శకులుగా, నటీగా, నిర్మాతగా ఎందరికో మార్గ దర్శకురాలు. భవితరాలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత ప్రతిభావంతురాలైన విజయ నిర్మల గారు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను తీవ్రంగా కలిచివేయడమే కాకుండా విషాదంలోకి నెట్టింది. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ తన సంతాప ప్రకటనను ట్వీట్ చేశారు.

కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











